టాలీవుడ్ నాచురల్ స్టార్ గా పేరుగాంచిన నాని, ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మ సినిమాతో నటుడిగా పరిచయం అయ్యాడు. అయితే తొలి సినిమానే మంచి సక్సెస్ సాధించి నానికి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత నుండి మెల్లగా తన ఆకట్టుకునే నటన, టాలెంట్ తో వరుసగా అవకాశాలు అందుకున్న నాని, ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించి దూసుకెళ్తున్నారు. ఇక తన కెరీర్ లో తొలిసారిగా వి సినిమా ద్వారా నెగటివ్ రోల్ లో నాని నటిస్తున్నాడు. 

 

తనకు హీరోగా తొలి అవకాశం ఇచ్చిన ఇంద్రగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండడంతో పాటు, ఈ సినిమాలో తనది నెగటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ, క్యారెక్టర్ లో ఉండే ఫీల్ తనకు నచ్చడంతో నాని ఈ సినిమాకు సైన్ చేసినట్లు సమాచారం. ఇక ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక ఈ విధంగా తొలిసారిగా నెగటివ్ క్యారెక్టర్ చేస్తూ కొంత డేరింగ్ స్టెప్ వేస్తున్న నాని, దానితో పాటు గతంలో వాల్ పోస్టర్ సినిమా పేరుతో ఒక సంస్థను స్థాపించి ఆ బ్యానర్ పై తొలిసారిగా అ అనే సినిమాని నిర్మించాడు. అప్పట్లో ఆ సినిమా రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. 

 

అయినప్పటికీ కూడా రెండవ సినిమా చేయడానికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా విశ్వక్ సేన్ హీరోగా హిట్ అనే సినిమాని ఎంతో గ్రాండ్ గా తన బ్యానర్ పై నిర్మిస్తున్నాడు నాని. ఈ విధంగా ఒకేసారి రెండు డేరింగ్ స్టెప్స్ వేస్తున్న నాని, ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి మరి. ఓవైపు కెరీర్ పరంగా చాలా రోజుల నుండి నానికి సరైన సక్సెస్ లేకపోవడంతో ప్రస్తుతం నటిస్తున్న వి సినిమా కనుక బాగా ఆడితే అది నాని కెరీర్ కు మంచి హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: