టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో హీరోగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. వాస్తవానికి చిన్నప్పుడే తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి నటవారసత్వంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన మహేష్, ఆ వయసులోనే తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక తొలిసారి హీరోగా నటించిన రాజకుమారుడుతో సూపర్ హిట్ కొట్టిన మహేష్, అక్కడి నుండి కెరీర్ పరంగా మెల్లగా విజయాలు అందుకుంటూ, అనతి కాలంలోనే టాలీవుడ్ నెంబర్ వన్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. ఇక మహేష్ కెరీర్ లో హిట్స్ తో పాటు కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి. అయితే తనకు హిట్ వస్తే అది తమ టీమ్ మొత్తం యొక్క ఫలితం అని చెప్పే మహేష్, ఫ్లాప్ వస్తే మాత్రం అది పూర్తిగా తన తప్పే అని చెప్పడం నిజంగా ఆయన దయార్ద్ర హృదయానికి నిదర్శనం. 

 

ఇక మహేష్ తన కెరీర్ లో ఇప్పటివరకు 26 సినిమాల్లో నటించినప్పటికీ, మొత్తం కెరీర్ లో ఆయన నటించిన కౌబాయ్ సినిమా అయిన టక్కరి దొంగ ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి. ఎప్పుడో కొన్నేళ్ల క్రితం ఆయన తండ్రి కృష్ణ పలు కౌబాయ్ సినిమాల్లో నటించి మంచి పేరు గడించారు. ఆ విధంగా మహేష్ కూడా టక్కరి దొంగ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించడంతో పాటు ఆ సినిమాలో పలు సాహసాలు కూడా చేసారు. దర్శకుడు జయంత్ సి.పరాన్జీ దర్శకత్వంతో పాటు ఆ సినిమాని తన జయంత్ ఫల్క్రమ్ సినెర్జీస్ బ్యానర్ పై స్వయంగా నిర్మించడం జరిగింది. ఇక కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూ లో జయంత్ మాట్లాడుతూ, టక్కరిదొంగ సినిమాలో అంతా బాగున్నప్పటికీ ప్రేక్షకులు ఆశించిన ఎంటర్టైన్మెంట్ మాత్రం మిస్ అయిందని, అయితే సినిమా విడుదలైన తొలిరోజుల్లో చాలా వరకు బాగానే కలెక్షన్ రాబట్టినప్పటికీ, మెల్లగా మాత్రం నిలబడలేకపోయిందని అన్నారు జయంత్. 

 

ఇక ఆ సినిమా గురించి ఎవ్వరికీ తెలియని ఒక విషయం ఉందని చెప్పిన జయంత్, ఆ సినిమా కోసం మహేష్ బాబు కనీసం ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా ఎంతో గొప్ప మనసుతో నటించారని అన్నారు. నిజానికి జయంత్ ఎప్పుడో ఈ విషయాన్ని బయటపెట్టినప్పటికీ, అంత గొప్ప మనసుతో ఒక స్టార్ హీరో తన రేంజ్ ని ప్రక్కన పెట్టి ఆ విధంగా పైసా కూడా తీసుకోకుండా యాక్ట్ చేయడం నిజంగా ఎంతో గ్రేట్ అని, ఇప్పటికీ కూడా ఆ విషయమై మహేష్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: