టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.  మొదటి సినిమా అక్కడి అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆయన కెరీర్ బిగినింగ్ లో ఫెయిల్యూర్స్ చవిచూసినా.. తమ్ముడు సినిమా నుంచి వరుస విజయాలు అందుకున్నాడు.  తొలిప్రేమ, ఖుషి సినిమాలతో లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు.  ఇక గబ్బర్ సింగ్ సినిమా తర్వాత మాస్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో అత్తారింటికి దారేది సినిమాతో ఫ్యామిలీ ఆడియాన్స్ కి బాగా దగ్గరయ్యారు.  గబ్బర్ సింగ్ సినిమా తర్వాత జనసేన పార్టీ స్థాపించి ప్రజా సేవకు ప్రజాక్షేత్రంలోకి వచ్చారు.  గత ఏడాది ఏపిలో ఎన్నికల్లో ఆయన పోటి చేసినప్పటికీ గెలవలేదు.

 

తాజాగా పవన్ కళ్యాన్ గురించి ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  పవన్ కల్యాణ్ కి 'గోకులంలో సీత' రెండవ సినిమా. ఆ సినిమాకి నేను దర్శకత్వం వహించాను. తమిళంలో కార్తీక్ చేసిన ఒక సినిమాకి ఇది రీమేక్. కథలో కొన్ని మార్పులు చేసి తెలుగు ప్రేక్షకులకు అందించాము.  ఈ సినిమా చేసే సమయంలో పవన్ కళ్యాన్ ని చాలా దగ్గరుండి గమనించాను.. ఆయనలో గట్టి పట్టుదల, చేయాలన్న ఆతృత.. సంకల్పం ఉన్నాయి.  ఎవరినీ నొప్పించాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. 

 

ఏ బాధ అయినా అందరితో షేర్ చేసుకుంటారు. తన పనిని తను చాలా సిన్సియర్ గా చేస్తూ వెళ్లేవాడు. ఎవరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదు .. ఏమీ అనేవాడు కాదు. పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాడు. ఆరంభంలో కాస్త బిడియంగా ఉండే ఆయన, ఇప్పుడు ఇలా మారిపోయిన విధానం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది  అని చెప్పుకొచ్చారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన మాస్ ఫాలోయింగ్ బాగా పెంచుకున్నారని ఆయన అన్నారు.  ఎవరైనా తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించేవారే నాయకుడు అవుతాడు అని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: