యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ సినిమా భీష్మ. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పిడివి ప్రసాద్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి స్పందనను రాబట్టగా, రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ కు కూడా విశేషమైన స్పందన రావడం జరిగింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై నిజానికి హీరో నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చాలా రోజుల క్రితం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆయన నటించిన అఆ తరువాత, ఇప్పటివరకు నితిన్ నటించిన మరొక సినిమా ఏది కూడా సక్సెస్ కాలేదు. 

 

ఇక ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్న నితిన్ కు ఈ సినిమా టైటిల్ తో కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యాయి. మహాభారతానికి మూలం భీష్మ పితామహుడు, ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆయన పేరును ఒక కమర్షియల్ సినిమాకు పెట్టటం ఏమిటి, అలానే ఆయన పేరుకి భంగం వాటిల్లేలా హీరో చేసే వెకిలి చేష్టల వలన ఆ మహానుభావుడి పేరుకి అపకీర్తి లభిస్తోందని తెలంగాణ బెస్త గూండ్ల చైతన్య సమితి వారు ఆందోళన బాట పట్టారు. అలానే నేడు ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన సమితి సభ్యులు, హీరో నితిన్ పై అలానే దర్శక నిర్మాతలపై విమర్శలు చేసారు. 

 

సినిమా టైటిల్ అభ్యంతరకరంగా ఉందని ఇటీవల తాము ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన అనంతరం, సినిమా నిర్మాతలు మాకు సినిమా చూపించారని, సినిమాలోని కొన్ని సీన్స్ కూడా అభ్యంతరంగా ఉండడంతో వాటిని తొలగించాలని దర్శక, నిర్మాతలకు చెప్పడం జరిగిందని అన్నారు. అయితే తమ అభ్యంతరాలు వారు ఏ మాత్రం పట్టించుకోటం లేదని, వారి ధోరణి ఇలానే కొనసాగితే, రేపు రిలీజ్ అయ్యే సినిమాని కూడా అడ్డుకుంటాం అని సమితి సభ్యులు అంటున్నట్లు తెలుస్తోంది. మరి నితిన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాకు ఈ విధమైన అడ్డంకులు ఎప్పుడు తొలుగుతాయో.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: