టాలీవుడ్ తాప్సీలోని నటిని వాడుకోలేకపోతోంది. బాలీవుడ్ మాత్రం ఈ బ్యూటీ యాక్టింగ్ టాలెంట్ ని ఫుల్ గా క్యాష్ చేసుకుంటోంది. గ్లామర్ పాత్రలకు టాటా చెప్పేసిన సొట్టబుగ్గల సుందరి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తో ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలోనే తాప్సీ ప్రజెంట్ హాలీవుడ్ రిమేక్ లో నటించేందుకు సిద్ధమవుతోందట. 

 

టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్ గా నిలదొక్కుకోవాలని చూసిన తాప్సీకి కలిసిరాలేదు. తెలుగులో కొన్ని పెద్ద సినిమాల్లో నటించినా సొట్టబుగ్గల సుందరికి సక్సెస్ దక్కలేదు. దీంతో బాలీవుడ్ చెక్కేసిన తాప్సీ టాలీవుడ్ కు రివర్స్ లో యాక్టింగ్ ఓరియెంటెడ్ మూవీస్ తో అవాక్కయ్యేలా చేసింది. బాలీవుడ్ సినిమాలతో తనలో ఎంతమంచి నటి దాగుందనే విషయాన్ని తాప్సీ నిరూపిస్తోంది. 

 

బాలీవుడ్ ఫిలింమేకర్స్ తాప్సీని కొత్తకోణంలో చూపిస్తున్నారు. తాప్సీ చేస్తున్న సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ కావడంతో ఈ బ్యూటీ కోసం స్పెషల్ స్టోరీస్ కూడా రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో తాప్సీ నటించిన ప్రయోగాత్మక చిత్రాలు పింక్, నాన్ షబానా, మన్మార్జియన్ లాంటి సినిమాలు నటిగా గొప్ప పేరునే తెచ్చిపెట్టాయి. లాస్ట్ ఇయర్ మిషన్ మంగళ్ తో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్న తాప్సీ ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అవుతోందట. 

 

జర్మన్ మూవీస్ రన్ లోలా రన్ రీమేక్ లో తాప్సీ నటించబోతుందట. 1999లో రిలీజైన రన్ లోలా రన్ ఆస్కార్ కు నామినేట్ అయింది. రెండు దశాబ్దాల తర్వాత ఈ జర్మన్ మూవీ బాలీవుడ్ రీమేక్ అవుతుండటం విశేషం.

 

పోగొట్టుకున్న డబ్బును, ప్రియుడిని రక్షించుకోవడం కోసం ఓ మహిళ ఏం చేసిందనేదే ఈ సినిమా కాన్సెప్ట్. కథ వింటుంటే తాప్సీకి మరో యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరికినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన తపడ్ 28న రిలీజ్ కాబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: