సుడిగాలి సుధీర్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్‌గా, యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. జబర్దస్త్ షోతో ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తూ బుల్లితెరపై మ్యాజిక్ క్రియేట్ సుధీర్. సుధీర్ ఎక్స్ప్రెషన్లోనూ.. ఎమోషన్లోనూ కామెడీనే ఉంటుంది. ఇక సుడిగాలి సుధీర్‌కి సంబంధించి.. ప్రేమ, పెళ్లి, పర్సనల్ లైఫ్ ఇలా ప్రతీదీ న్యూసే.. అయితే అవే అప్పుడప్పుడు కామెడీగా మారి ఆటో పంచుల్లా పేలుతుంటాయి. పడి పడి నవ్వులా చేస్తుంటాయి. ఇక ఇతని స్పెషలిటీ ఏంటంటే.. తన రొమాంటిక్ క్యారెక్టర్ తో అందర్నీ కడుపుబ్బా నవ్వించడం.
ఈ ప్లస్ ని పక్కన పెడితే.. ఆయన వ్యక్తిత్వం కూడా బంగారమే అని తెగ మెచ్చుకుంటారు సుధీర్ అభిమానులు. అలాగే ఢీలో కూడా సుధీర్ ప్రేక్షకులను ఎంతగానూ ఆకట్టుకుంటాడు. ఆ షోలో టీం కెప్టెన్స్ గా ఉన్న సుధీర్, రష్మిలతో ప్రదీప్ చేసే కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఢీ వేదికపైనా సుధీర్ ఓ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రష్మీతో సుధీర్ కెమిస్ట్రీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇక ఢీ షోలో సుధీర్, రష్మి జంట టీం లీడర్లుగా ఉంటే మరో టీం లీడర్లుగా హైపర్ ఆది, వర్షిణి టీం లీడర్లుగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సుధీర్‌తో పోటీ పడుతున్నాడు హైపర్ ఆది. పంచ్ డైలాగ్ తో ప్రేక్షకులును కట్టిపడేస్తున్న హైపర్ ఆది.. జబర్దస్త్ చేస్తూనే సినిమాల్లో కమెడియన్‌గా వేశాలు వేస్తున్నాడు.
అయితే ఇన్నాళ్లు పంచ్ డైలాగ్ లకే పరిమితమైన ఆది ఈ మధ్య సుధీర్ మాదిరిగా లవర్ బాయ్ ఇమేజ్ కోసం తహతహలాడుతున్నట్టు కనిపిస్తోంది. జబర్ధస్త్ లో అనసూయతో కలిసి చిందులేసినా ఆ ఇమేజ్ రాలేదు. అయితే ఇప్పుడు హైపర్ ఆది, వర్షిణి తో కలిసి ఢీ వేదిక పై ఓ రొమాంటిక్ సాంగ్ లో వేసిన చిందులు చూసి ఆడియన్స్‌తో పాటు జడ్జెస్ కూడా నోరెళ్లబెట్టారు. డాన్స్ స్టెప్స్ విషయం పక్కన పెడితే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే సక్సెస్ అయింది అనిపించుకునే ప్రయత్నం చేశాడు ఆది. మరి ఇది ఎంత వరకు వర్కోట్ అవుతుందో ముందు ముందు చూడాలి.