ఉదయ్ కిరణ్.. అంత గొప్ప నటుడుని మళ్లీ చూడగలమా? ఎంతో గొప్ప నటుడు అయిన ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. ఎంతోమంది ప్రేమను పొందిన హీరో.. తీసిన ప్రతి సినిమా ఓ సమయం వరుకు హిట్ కొట్టిన వ్యక్తి ఉదయ్ కిరణ్. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న ఈ ఉదయ్ కిరణ్ అప్పట్లో స్టార్ హీరో. 

 

కేవలం సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలో కూడా స్టార్ హీరోనే.. ఎంత ఎదిగిన పొగరు చూపించకుండా రియల్ హీరో అయ్యాడు. ప్రతి ఒక్కరితో నవ్వుతు మాట్లాడుతూ అందరిలో ఒకడిగా కలిసిపోయేవాడు.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా టాలీవుడ్‌లోకి తారాజువ్వలా దూసుకొచ్చిన అద్భుత నటుడు ఈ ఉదయ్ కిరణ్. 

 

ఇక పోతే.. ఉదయ్ కిరణ్ సక్సెస్ చూసి.. సక్సెస్ అంటే మాములు సక్సెస్ కాదు.. కెరీర్ ప్రారంభంలోనే వరుస విజయాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉదయ్ కిరణ్ నిలిచాడు. అందుకే ఈ అద్భుత నటుడిని అల్లుడిగా చేసుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆరాటపడ్డాడు. ఈ క్రమంలో చిరు పెద్ద కుమార్తెతో ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యింది.

 

ఇక ఆలా ఆలా.. ఉదయ్ కిరణ్ సినీ కెరీర్ నాశనం అవుతూ వెచ్చింది.  ఉదయ్ కిరణ్ కు ఉన్న సినిమాలు అన్ని క్యాన్సిల్ అవ్వడం, కొత్త అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకొని అర్ధాంతరంగా తనువు చాలించాడు. దీంతో టాలీవుడ్ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. 

 

అయితే ఇప్పుడు ఇది అంత పక్కన పెడితే.. ఉదయ్ కిరణ్ ని చిరంజీవి అల్లుడుగా చేసుకోవాలి అనుకున్న సమయంలో ఉదయ్ కిరణ్.. పవన్ కళ్యాణ్.. చిరంజీవి కలిసి ఓ ఫోటో దిగారు. ఆ ఫొటోలో చిరంజీవి, ఉదయ్ కిరణ్ సూపర్ గా ఉన్నారు.. ఇక ఇప్పుడు ఆరడుగుల బెల్లెట్ మాత్రం ఇతను హీరోనా అనే విధంగా ఉన్నాడు అని అంటున్నారు కొందరు నెటిజన్లు. 

 

అయితే ఉదయ్ కిరణ్ నటన పరంగా ఓ అద్భుతం అయితే.. అందం పరంగా కూడా అదుర్సే.. నిజానికి ఉదయ్ కిరణ్ జీవితం చాలావరకు బాధలు చూశాడు.. స్టార్ హీరో ప్లేస్ లో ఫస్ట్ ఉంటాడు అనుకున్నవాడు అసలు సినిమా హీరోల్లోనే లేకపోవడం బాధాకరం అనే చెప్పాలి. ఏది ఏమైనా మీకు ఆ ఫోటో చూస్తే ఏ హీరో బాగున్నాడు అనిపిస్తుంది?

మరింత సమాచారం తెలుసుకోండి: