టాలీవుడ్ ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి సినిమా అంటేనే ఇప్పుడు ఎన్ని రోజులకు సినిమా స్టార్ట్ అవుతుందో ?  ఎప్ప‌ట‌కి పూర్త‌వుతుందో ? అన్న‌ది ఎవ్వ‌రికి తెలియ‌దు. రాజమౌళి సినిమా అంటేనే సోషల్ మీడియాలో ప్రతీ ఒక్కరికీ వెటకారం అయ్యిపోయింది. రాజ‌మౌళి అన్నా.. ఆయ‌న సినిమాలు అన్నా అంద‌రికి గౌర‌వం ఉన్నా మ‌రీ ఎక్కువ టైం తీసుకోవ‌డం స‌ర‌దాగా నెటిజ‌న్లు ఆటాడుకుంటూ ఉంటారు. బాహుబ‌లి నుంచి రాజ‌మౌళి త‌న సినిమాల‌కు ముందుగ  ఓ రిలీజ్ డేట్ ఇవ్వ‌డం.. త‌ర్వాత దానిని పోస్ట్ పోన్ చేయ‌డం జ‌రుగుతూ వ‌స్తున్నాయి.



ఇక రాజ‌మౌళి ప్ర‌స్తుతం టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ కాంబోలో తెర‌కెక్కిస్తోన్న సినిమా విష‌యంలో సైతం అదే పోస్ట్ పోన్ అంశం తీసుకు వ‌చ్చారు. దీనిపై   సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో సెటైర్లు పడడం మొదలయ్యాయి. ఇక ఈ సినిమాను ముందుగా అనుకున్న‌ట్టుగా ఈ యేడాది జూలై నుంచి వ‌చ్చే యేడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 8వ తేదీన రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.



దీంతో ముందుగా అనుకున్న తేదీ కంటే క‌నీసం ఆరేడు నెల‌లు ఈ సినిమా ముందుకు వెళ్లిపోయింది. అయితే ఈ లోగానే ఎన్టీఆర్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేయించేశాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా వ‌చ్చే స‌మ్మ‌ర్‌కే అని ప్ర‌క‌టించేశారు. ఈ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే రాజ‌మౌళిపై సెటైర్లు మొద‌ల‌య్యాయి.



కొంప‌తీసి ఆర్.ఆర్.ఆర్ క‌న్నా ఈ సినిమాయే ముందుగా విడుద‌ల అవుతుందేమో ?  రాజ‌మౌళి.. మీ సినిమాను మ‌రోసారి వాయిదా వేయరు క‌దా ? అని కొంద‌రు స‌ర‌దాగా జోకులు పేలుస్తున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ దెబ్బ‌తో నెటిజ‌న్లు రాజమౌళి ఆల‌స్యంపై మ‌రోసారి స‌ర‌దాగా ఆడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: