టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ రూటు కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. ముందు కొన్ని సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ హీరో, ఆ తర్వాత కొన్ని రోజుల పాటు కొన్ని మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చాడు. దీనితో టాలీవుడ్ లో నితిన్ వరుసగా హిట్ లు అందుకోలేకపోయాడు. ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే నితిన్ లో ధైర్యం మాత్రం ఎక్కడా తగ్గలేదు. వరుసగా సినిమాలు చేస్తూ ఇష్క్ సినిమాతో లైన్ లోకి వచ్చాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ హిట్ కొట్టేసాడు.

 

మళ్ళీ ఆ తర్వాత హను రాఘవపుడి దర్శకత్వంలో ఒక సినిమా చేసినా అది హిట్ ఇవ్వలేదు. అయినా సరే మళ్ళీ ట్రాక్ లోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేసాడు. ఈ ప్రయత్నాల్లోనే అతను మాస్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు. ఇష్క్ సినిమాతో ఈ ప్రయత్నం విజయవంతం అయింది. ఇక ఇప్పుడు భీష్మ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా కథ కాస్త ప్రత్యేకంగా ఉంటుంది. వ్యవసాయం ఆధారంగా చేస్తున్నాడు ఈ సినిమాను. దీనితో నితిన్ ఎంత వరకు సక్సెస్ అవుతాడు అనేది చూడాలి.

 

సినిమా ప్రమోషన్ పరంగా గాని ఇప్పటి వరకు విడుదల చేసిన ట్రైలర్స్, టీజర్స్ పరంగా గాని చూస్తే సినిమా క్లాస్, మాస్ ని దగ్గర చేసుకునే విధంగానే ఉందని చెప్పవచ్చు. అయితే కొత్త ప్రయోగ౦ కావడంతో నితిన్ ఎంత వరకు ఈ ప్రయత్నం లో విజయం సాధిస్తాడు అనేది చూడాలి. కాగా ఈ సినిమాలో రష్మిక మంధన హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రానుంది. సితార బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. చూద్దాం ఎంత వరకు హిట్ కొడతాడో.  

మరింత సమాచారం తెలుసుకోండి: