‘కేరాఫ్ కంచెరపాలెం’ వంటి విభిన్న కథా మూవీతో ప్రేక్షకుల ఆదరణ, విమర్శకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కిస్తున్న తాజా మూవీ.. ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఈ మూవీ మలయాళంలో విజయవంతమైన ‘మహేశింతే ప్రతీకారమ్’ సినిమాకు రిమేక్ గా రూపొందుతుంది. సాధారణంగా కొత్త నటులతో తొలి మూవీతోనే హిట్ అందుకున్న యువ దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో వస్తున్న రెండో మూవీ ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను ‘మహా శివరాత్రి’ సందర్భంగా విడుదల చేశారు. తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వపడే ఈ గొప్ప మూవీ అందించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై.. మహాయాణ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్‌పై విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
తాజాగా విడుదలైన టీజర్ దర్శకుడి వెంకటేష్ మహా శైలికి దగ్గట్టే చాలా వినూత్నంగా ఉంది. చక్కటి పల్లెటూరు నేపథ్యంలో రియాలిటీకి దగ్గరగా సన్నివేశాలు ఉన్నాయి. ఈ టీజర్ లో సత్యదేవ్ ఫోటోగ్రాఫర్ గా కనిపిస్తున్నాడు. హీరోహీరోయిన్ల ప్రేమ నేపథ్యంలో వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి.. వీరి ప్రేమకు ఎవరు అడ్డు చెబుతున్నారు.. వారిని హీరో ఎలా ఎదుర్కొంటాడు అన్న కథతో సాగుతున్నట్లు తెలుస్తుంది. అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫీతో పాటు.. బిజ్బల్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ టీజర్‌కి హైలైట్‌గా ఉంది.
నటుడు నరేష్‌తో పాటు జబర్దస్త్ రాం ప్రసాద్, రవీంద్ర విజయ్, సుభాష్ ఇతర పాత్రల్లో నటించారు. ప్రతీకారం నేపథ్యంలో చిత్ర కథ నడుస్తుందని అర్ధమవుతుంది. 2020 ఏప్రిల్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాల్లో ఉన్న ఈ మూవీ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మద్య చిన్న సినిమాలు మంచి కంటెంట్ తో వస్తు విజయం అందుకుంటున్నాయి.