టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, తన తండ్రి నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి నట వారసత్వంతో నీడ సినిమా ద్వారా బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో బాల నటుడిగా నటించి మంచి పేరు దక్కించుకున్న మహేష్ బాబు, కొన్నాళ్లు గ్యాప్ తీసుకొని ఆపై నటన, డాన్స్, ఫైట్స్ వంటి వాటిలో మరింత శిక్షణ తీసుకొని రాజకుమారుడు సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక తొలి సినిమాతోనే అత్యద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మహేష్ బాబు, అక్కడి నుండి వరుసగా అవకాశాలు చేజిక్కించుకుని మెల్లగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు టాలీవుడ్ అగ్ర నటుల జాబితాలో చేరారు. 

 

ఇక మహేష్ బాబుతో ఒకసారి సినిమా చేసిన దర్శకుడు ఎవరైనా సరే పదేపదే ఆయనతో సినిమాలు చేయాలని కోరుతూ ఉంటారు. అయితే అందుకు ఒక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. అదేమిటంటే, ముందుగా ఎవరైనా దర్శకుడు మహేష్ వద్దకు వెళ్లి కథ వినిపించిన తర్వాత ఆ కథ ఆయనకు నచ్చి సినిమా చేయడానికి ఒప్పుకుంటే, ఇక సినిమా ప్రారంభం నుండి పూర్తయ్యేవరకూ కథా, కథనాల విషయంలో మహేష్ బాబు ఏ మాత్రం జోక్యం చేసుకోరని, అలానే దర్శకుడికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛను ఇస్తారని, ఈ విషయంలో మహేష్ బాబుని మించిన మరొక టాలీవుడ్ నటుడు లేడు అని ఇప్పటికే పలు సందర్భాల్లో కొందరు దర్శకులు చెప్పడం జరిగింది. 

 

ఏ సినిమాకైనా ముందుగా హీరో దర్శకుడికి కనుక పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చి నట్లయితే, ఆ సినిమా మంచి సక్సెస్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని, ఆ విధంగా దర్శకుడికి పూర్తిగా సరెండర్ అయి, సినిమా పూర్తి చేసే మహేష్ బాబు ఈ విషయంలో మిగతా హీరోల కంటే ఒకింత ప్రత్యేకమని పలువురు సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: