మన టాలీవుడ్ పరిశ్రమకు విక్టరీ వెంకటేష్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన లక్ష్మీ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది మలయాళ నటి నయనతార. నిజానికి మొదట్లో మలయాళంలో కొన్ని టీవీ షోలు అలానే అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటించిన నయనతార, ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన చంద్రముఖి అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. అప్పట్లో ఆ సినిమా అనూహ్యంగా అతిపెద్ద విజయాన్ని అందుకోవడంతో నయనతార కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా లక్ష్మి కూడా సూపర్ హిట్ కొట్టడంతో ఆపై టాలీవుడ్లో కూడా ఆమెకు మంచి పేరు దక్కింది. 

 

ఇక అక్కడి నుండి టాలీవుడ్, కోలీవుడ్, రెండు భాషల్లోనూ పలువురు స్టార్ హీరోల సరసన వరుసగా అవకాశాలు సంపాదించి మంచి హిట్స్ అందుకున్న నయనతార, ప్రస్తుతం స్టార్ హీరోయిన్ స్టేటస్ తో కొనసాగుతోంది. ఇటీవల ఎక్కువగా కొంత విభిన్నంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగుతున్న నయనతారను తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకోవడానికి కొందరు నిర్మాతలు భయపడుతున్నట్లు సమాచారం. ఇటీవల ఒక తమిళ బడా స్టార్ సినిమాలో ఆమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందని, ముందుగా ఆ సినిమా దర్శకుడు కథ రీత్యా హీరోయిన్ పాత్రకు నయనతార అయితేనే కరెక్ట్ అని ఫిక్స్ అయి, ఆ విషయాన్ని నిర్మాతకు తెలియజేశాడట. 

 

అయితే నయనతార పేరు చెప్పగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సదరు నిర్మాత, వామ్మో బుద్ధి, జ్ఞానం ఉన్నోడు ఎవడు కూడా ఆమెను హీరోయిన్ గా తీసుకోడు, ఆమె పెట్టే కండిషన్లకు, నియమాలకు తట్టుకోవడం నా వల్ల కాదు, పైగా ఆమెను ప్రమోషన్స్ కార్యక్రమాలకు రప్పించాలంటే నా తల ప్రాణం తోకకు వస్తుంది. ఆమెకో దండం బాబోయ్, ఆమె వద్దే వద్దని, కావాలంటే ఆమె స్థానంలో మరింత ఎక్కువగా పారితోషికం ఇచ్చి మరొక హీరోయిన్ తీసుకుందామని దర్శకుడితో చెప్పాడట. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు గాని ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: