టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంతో మంది డ్యూయెల్ రోల్ లో కనిపించారు. కథ బలంగా ఉంటే క్యారెక్టర్స్ కుదిరితే డ్యూయెల్ రోల్ సినిమాలు హీరోలకు బాగా కలిసి వస్తుంటాయి.   స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్…మెగా ఫామిలీ నుంచి వచ్చినప్పటికీ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాలో సరికొత్త స్టైల్ ను యూత్ కు ప్రరిచయం చేస్తూ యూత్ ఐకాన్ గా నిలిచాడు. ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ ఓవర్సీస్ లో కూడా దుమ్మురేపింది.  గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు కూడా మంచి హిట్ గా నిలిచాయి.

 

సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల పరంగా దుమ్ము దులిపేసింది. అయితే ఈ సినిమా చేస్తున్న సమయంలోనే బన్నీ సుకుమార్ తో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో బన్నీ చాలా రఫ్ లుక్ తో కనిపించబోతున్నాడట. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ మూవీలో బన్ని డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా హీరో లేకుండానే కొన్ని సీన్స్ కూడా షూట్ చేసారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.   ఇందులో అల్లు అర్జున్ కూడా స్మగ్లర్‌గా కనిపిస్తాడని కొందరు అంటుండగా.. ఆ ముఠాకు సహకరించే లారీ డ్రైవర్‌గా చేస్తున్నాడని మరికొందరు చెబుతున్నారు. 

 

ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఒక రోల్లో గడ్డం పెంచుకొని రింగుల జుట్టుతో అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. మరో లుక్ నేచురల్ గా ఉండటం కోసమే ఆయన కొంత సమయం తీసుకుంటున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. సుకుమార్ ఎప్పుడు హీరోలను కొత్తదనంగా చూపిస్తుంటారు.. ఆ విషయం తెలిసిందే.  ఇప్పుడు బన్నీని ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: