సుకుమార్ సినిమాల్లో హీరోలు ఎంత యూనిక్ గా ఉంటారో వాళ్ల లుక్ కూడా అంతే స్పెషల్ గా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి మొదలుపెడితే బాడీ లాంగ్వేజ్ వరకు అన్నీ సమ్ థింగ్ డిఫరెంట్ ఉంటాయి. ఈ యూనిక్ నెస్ కోసమే ముంబయి టీమ్ ని దించుతున్నాడట అల్లు అర్జున్. 

 

టాలీవుడ్ లో సుకుమార్ సినిమాలకు స్పెషల్ ఫాలోయింగ్ ఉంది. సుకుమార్ టేకింగ్ కు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక ఈ దర్శకుడు హీరోలను ప్రజెంట్ చేసే ప్రాసెస్ కు రాజమౌళి లాంటి డైరెక్టర్స్ కూడా ఫిదా అవుతుంటారు. వన్-నేనొక్కడినేలో మహేశ్ బాబుని మజిల్డ్ బాడీతో చూపించిన సుకుమార్, నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ ను కంప్లీట్ డిఫరెంట్ గా ప్రజెంట్ చేశాడు. ఇక రంగస్థలంలో అయితే చరణ్ ని ఫుల్ మాసీగా ప్రజెంట్ చేశాడు. 

 

అల్లు అర్జున్ సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్నాడు. చిత్తూరు ప్రాంతంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. రా స్టోరీగా వస్తోన్న ఈ మూవీలో బన్నీని చాలా స్పెషల్ గా చూపించబోతున్నాడట సుకుమార్. బన్ని స్టైలిష్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టుగా థిక్ బియర్డ్ తో న్యూలుక్ తో ప్రజెంట్ చేస్తాడని చెబుతున్నారు. అందుకే ముంబయి నుంచి స్టైలిష్ట్ లని దింపుతున్నారట బన్నీ,సుక్కూ. 

 

సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ఇంతకుముందు ఆర్య, ఆర్య2 సినిమాలు వచ్చాయి. వీటిల్లో బన్నీ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ లో కనిపించాడు. మరి హ్యాట్రిక్ కాంబినేషన్ గా వస్తోన్న ఈ ఎర్రచందనం కథలో అల్లు అర్జున్ ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్యారెక్టర్ లో ఎలాంటి వేరియేషన్స్ ఉంటాయి అనేది.. తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అల్లు అర్జున్ కొత్తగా ట్రై చేయాలని తెగ ఆరాటపడుతున్నాడు. అందుకే సుకుమార్ తో కలిసి చాలా ప్లాన్సే వేస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: