తనదైన అందంతో  తెలుగు ప్రేక్షకుల అందరికీ చమటలు పటించి... నిర్మాతలందరినీ ఆకర్షిస్తూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నిధి అగర్వాల్. హిట్టు  ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది. వరుసగా రెండు డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు... పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన  ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో గ్లామర్ పరంగా నటన పరంగా అందరినీ ఆకర్షించింది. అయితే మామూలుగా చిత్ర పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే హీరోయిన్ కి మార్కెట్ వ్యాల్యూ ఉంటుంది. ఎంత గ్లామర్ ఉన్నా ఎన్ని అందాలు ఒలకబోస్తున్న సరైన విజయాలు సాధించకపోతే హీరోయిన్లకు అంతగా డిమాండ్ ఉండదు. 

 

 

 ఒకవేళ విజయాలు సాధించినా దాని కరెక్ట్ గా వాడుకోవాల్సినా అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ విషయంలో మాత్రం ఇస్మార్ట్ బ్యూటీ వెనుకబడి పోయినట్లు తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తో బడా సినిమాలో అవకాశం దక్కించుకుంటుంది  అనుకుంటున్న సమయంలో నిధి అగర్వాల్ మాత్రం... ఇస్మార్ట్ శంకర్ మూవీ విజయం ద్వారా వచ్చిన క్రేజ్ ను సరిగ్గా ఉపయోగించు కోవడం లేదు అని తెలుస్తోంది. ఎంత క్రేజ్ సంపాదించిన ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ హాట్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా  అశోక్ హీరోగా పరిచయం అవుతున్న  సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత... కొత్త హీరోతో  సినిమా  చేయడం అది కూడా డెబ్యూ మూవీ కావడం ఈ అమ్మడు కెరీర్ కు కాస్త మైనస్ అయ్యేలాగే కనిపిస్తోంది. 

 

 

 కానీ ఇస్మార్ట్ శంకర్ లో నటించిన మరో హీరోయిన్ నభ  మాత్రం తన క్రేజ్ను పర్ఫెక్ట్గా ఉపయోగించుకుంటూ... వరుస అవకాశాలను అందిపుచ్చుకుని దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం నిధి అగర్వాల్ నటిస్తున్న సినిమా హిట్టయినా నిధి అగర్వాల్ కు అంతగా డిమాండ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం మినిమమ్ రెంజ్  సినిమాలు కూడా నిధి అగర్వాల్ కు వచ్చే అవకాశాలు లేనట్లే అని  సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మళ్లీ అన్ లక్కీ  హీరోయిన్ ల  లిస్ట్ లోకి వెళ్లి పోతుంది ఈ హాట్ భామ. మరి ఈ సినిమా చేస్తూనే మరో బడా హీరో సినిమాలో కూడా నటిస్తే నిధి అగర్వాల్ కెరీర్ కు కాస్త కలిసొచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: