తమిళ హీరో సూర్య కి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తమిళం కన్నడ లోనే కాకుండా తెలుగులో కూడా హీరో సూర్య అభిమానులు ఎంతో మంది. హీరో సూర్య సినిమాల కోసం ఎంతోమంది అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. తనదైన పవర్ఫుల్ నటనతో  ప్రతి సినిమాలో ఇతగదీస్తు  ఉంటారు తమిళ హీరో సూర్య. ఇప్పటికే ఎన్నో వైవిధ్యత్మ సినిమాలతో... తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. ఇక ఆయన కెరీర్లో ఎన్నో సంచలన విజయాలు కూడా ఉన్నాయి. ఇక ప్రస్తుతం తమిళ హీరో సూర్య సుధా కొంగర కాంబినేషన్లో ఆకాశం నీ హద్దురా అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 

 

 

 కాగా ఈ సినిమా సూర్య అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా సూరారై  పోట్రు అనే పేరుతో తమిళంలో తెరకెక్కుతుంది.. కాగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల అవ్గా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది ఫస్ట్ లుక్. మరోసారి వైవిధ్యత్మమైన కథతో తమిళ హీరో సూర్య ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలో నుంచి ఒక సాంగ్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం.

 

 

 ఈ సినిమాలో పిల్ల పులి అనే సాంగ్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నెటిజన్లను ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది ఈ పాట. పిల్ల పులి అనే ఈ పాటకు మంచి ఆదరణ పొందుతోంది. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఈ పాటకు రామజోగయ్య రాసిన లిరిక్స్ తోడవడంతో.. పిల్ల పులి పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. కాగా ఈ సినిమా సామాన్యుడికి సైతం విమాన సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఇక ప్రముఖ నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించడం తో ఈ సినిమా పై మరింత హైప్ పెరిగిపోయాయి. కాగా సుధా కొంగర గతంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన గురు సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా రోజులే ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంతోమంది ఈ సినిమా రైట్స్ ని దక్కించుకునేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సన్ నెట్వర్క్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తంలో చెల్లించి దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 9న విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: