తెలుగు సినిమా పరిశ్రమలో కొందరు నటులు తొలుత నటించిన రెండు, మూడు సినిమాలతో అత్యద్భుత విజయాన్ని అందుకొని ఉన్నత స్థానాలకు చేరి, ఆపై కెరీర్ ని సక్రమంగా పంచుకోలేక తప్పటడుగులు వేసి ఆ విధంగా ఆకాశాన్ని అందుకో పోయి నడ్డి విరగొట్టుకున్న హీరోలు ముఖ్యంగా కొందరు ఉన్నారు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది తరుణ్, ఉదయ్ కిరణ్, వరుణ్ సందేశ్ గురించి. ముందుగా, నువ్వే కావాలి అనే సినిమాతో హీరోగా పరిచయమైన ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారమణి తనయుడైన తరుణ్, ఫస్ట్ మూవీ తో సూపర్ హిట్ కొట్టి యూత్ లో, అమ్మాయిలలో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. ఇక ఆ తర్వాత కూడా ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను వంటి సినిమాలతో మరింత మంచి పేరు ఆర్జించిన తరుణ్, ఆపై మాత్రం కెరీర్ ను సక్రమంగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. 

 

ఇక అక్కడి నుంచి వరుసగా వస్తున్న అవకాశాలను పూర్తిగా అపజయాలుగా మిగిల్చుకున్న తరుణ్, ఒక్కసారిగా పూర్తిగా వెనుకబడి పోయాడు. ఇక మరొక నటుడు ఉదయ్ కిరణ్ పరిస్థితి కూడా దాదాపుగా అంతే అని చెప్పాలి. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్, ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకుని, అతను కూడా మంచి క్రేజ్ సంపాదించాడు. ఆపై తేజ దర్శకత్వంలో మరొకసారి నటించిన నువ్వు నేను, అలానే వి.యన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనసంతా నువ్వే సినిమాలతో ఎవర్ గ్రీన్ సూపర్ హిట్స్ అందుకున్న ఉదయ్ కిరణ్, ఆ తర్వాత నుండి మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక చాలా వరకు వెనకబడ్డాడనే అనే చెప్పాలి. ఇక అప్పట్లో మెగాస్టార్ కూతుర్ని వివాహం చేసుకోవాల్సిన ఉదయ్ కిరణ్, కొన్ని అనివార్య కారణాలవల్ల అది కుదరక పోవడం, అలానే ఆ తరువాత సినిమా అవకాశాలు విషయమై కూడా పూర్తిగా వెనుకబడ్డాడు. 

 

ఇక ఈ విధమైన కోవకు చెందిన మరొక నటుడు వరుణ్ సందేశ్, క్లాస్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాలోని నలుగురి నటుల్లో ఒకడుగా నటించిన వరుణ్ సందేశ్, ఆ సినిమాతో ఒక్కసారిగా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించాడు. స్వతహాగా ఎన్నారై అయిన వరుణ్ సందేశ్ కు ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన కొత్తబంగారు లోకం సినిమాలో హీరోగా అవకాశం రావడం, ఆ సినిమా కూడా అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో వరుణ్ సందేశ్ కు మరింత గొప్ప పేరు లభించింది. అయితే అతను కూడా ఆపై వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోలేక వరుస అపజయాలు అందుకుని కెరీర్ పరంగా ఎంతో వెనుకబడి పోయాడు. ఈ విధంగా ఈ ముగ్గురు హీరోలు కూడా కెరీర్ సరైన పిక్స్ లో ఉన్న సమయంలో కొంత జాగ్రత్త పడ్డట్లయితే ఈ పాటికి ఖచ్చితంగా మంచి భవిష్యత్తుతో మంచి హీరో స్టేటస్ తో కొనసాగుతూ ఉండే వారని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: