డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ చాలా కాలం తర్వాత ఇంకా చెప్పాలంటే చాలా సినిమాల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫాం లోకి వచ్చాడు. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులు, ఆర్ధికంగా భారీ నష్టాలు అనుభవించారు పూరి. అవన్నీ తట్టుకొని నిలబడి మొండి ధైర్యంతో పూరీ మీద అపనమ్మకంతో ఏ హీరో ముందుకు రాకపోతే ఫ్లాపుల్లో ఉన్న రాం పోతినేనితో ఇస్మార్ట్ శంకర్ ని తెరకెక్కించాడు. ఈ సినిమా తెరకెక్కుతున్నన్ని రోజులు కూడా అటు ఇండస్ట్రీ వర్గాల్లో గాని ఇటు ప్రేక్షకుల్లో గాని నెగిటివ్ కామెంట్సే వినిపించాయి తప్ప పాజిటివ్ బజ్ క్రియోట్ అయిందిలేదు.

 

కానీ టీజర్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కాస్త జనాలలో అభిప్రాయం మారుతూ వచ్చింది. సాంగ్స్ కి సంబంధించిన ప్రోమోస్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యయో ఒక్కసారిగా ఇస్మార్ట్ శంకర్ సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక సినిమా రిలీజ్ అయి మార్నింగ్ షో కంప్లీటయినప్పటి నుంచే సినిమా హిట్ సూపర్ హిట్ అన్న టాక్ వచ్చింది. ఫస్ట్ వీక్ కంప్లీటయ్యో సరికి కలెక్షన్స్ పరంగా దుమ్మురేపి పూరి ఈజ్ బ్యాక్ అన్న టాక్ వచ్చింది. ఈ సినిమా హీరో రాం తో పాటు పూరీ టీం మొత్తానికి మంచి సక్సస్ ని ఇచ్చింది.

 

దాంతో పూరీ డబుల్ ఎనర్జీతో విజయ్ దేవరకొండ హీరోగా సినిమాని అనౌన్స్ చేశాడు. నిజంగా పూరి డేరింగ్ స్టెప్ అంటే ఇదే. ఎందుకంటే మంచి హిట్ అందుకున్న పూరి సక్సస్ లో ఉన్న హీరోని సెలెక్ట్ చేసుకోకుండా విజయ్ ని సెలెక్ట్ చేసుకొని అందరికీ షాకిచ్చాడు. ఆ తర్వాత ఇదే సినిమాకి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తోడయ్యారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని రూపొందిస్తున్నారు.

 

అయితే విజయ్ గత కొంతాలంగా షూటింగ్ సమయంలో దర్శకుల పనిలో వేలు పెడుతున్నాడని టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఘోరంగా ఫ్లాపయిందని అంటున్నారు. అలాగే పూరీకి సలాహాలిస్తున్నాడని సమాచారం. అయితే పూరీ ఊరుకోకుండా విజయ్ కి స్మూత్ గా షాకిచ్చాడట. విజయ్ వాళ్ళ దగర వేసినట్టు వేశాలేస్తే నా దగ్గర దొబ్బదు ...డిసైడ్ చేసుకో లేదా సైడయిపో వేరే హీరో రెడీగా ఉన్నాడు... అంటూ పూరి తెగేసి చెప్పాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: