ఇండియన్ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. బాల నటిగా సిని పరిశ్రమలో అడుగు పెట్టిన ఆమె ఆ తర్వాత ఇండియన్ సినిమాను శాశించే స్థాయికి వెళ్ళింది అనేది వాస్తవం. ఆమెతో సినిమాలు చేయడానికి ఎందరో హీరోలు ఆసక్తి చూపించే వారు. ఆమెతో చేసిన సినిమా హిట్ అయితే చాలు ఇక తిరుగు ఉండదు అని భావించారు. ప్రజల్లోనే కాదు, సినీ జనాల్లో కూడా ఆమెకు ఎందరో అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూసే వారు. 

 

అయితే ఆమె కెరీర్ మాత్రం ఒక విషయంలో మలుపు తిరిగింది. కెరీర్ కి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం ఆమె ఇబ్బందులు పడింది. తనతో కలిసి హీరోగా నటించిన అనీల్ కపూర్ సోదరుడితో ఆమె ప్రేమలో పడటమే. ఆయనే బోనీ కపూర్... బోని ఆమె నటించిన సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సమయంలో తన వ్యక్తిగత విషయాలను ఆయనతో చెప్పుకోవడం, ఆయన ఆమె మీద కాస్త ప్రేమ చూపించడం వంటివి జరిగి చివరికి పెళ్లి అయినా సరే ఆమెను పెళ్లి చేసుకున్నారు. 

 

ఆ తర్వాత శ్రీదేవి ఎన్ని అవమానాలు పడిందో అందరికి తెలుసు. నా అన్న వాళ్ళను దూరం చేసుకుంది, ఆమెకు సన్నిహితులు అనే వారు లేకుండా పోయారు. పిల్లల కోసమే జీవితం అయిపోయింది. ఇష్టపడిన వాడినే ప్రపంచం అనుకుంది. అటు కుటుంబం కూడా ఆమెకు దూరం అయింది. తల్లి లేదు, తండ్రీ లేడు, సోదరి శ్రీలత ఆమెకు దూరంగా ఉంటూ వచ్చింది. ఆ తర్వాత పిల్లలు పుట్టడం, వాళ్ళు పెద్ద వాళ్ళు అవడంతో ఒక్కో అవమానాన్ని ఆమె మర్చిపోతూ వచ్చింది. అయినా సరే సినిమా కెరీర్ కి ఆమె ఏ ఇబ్బంది పడలేదు. అన్ని భాషల్లో మంచి సినిమాలు చేసింది శ్రీదేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: