టాలీవుడ్ లో ఇప్పటి వరకు పునర్జన్మ నేపథ్యంలోఎన్నో సినిమాలు వచ్చాయి.. ఇలాంటి సినిమాలు ఎక్కువగా ప్రేమ కథలు కావడం విశేషం.  ఒకప్పుడు నాగేశ్వరనావు, సావిత్రి, జమున నటించిన ‘మూగమనసులు’ పునర్జన్మ నేపథ్యంలో వచ్చిందే.  ఆ తర్వాత అక్కినేని నాగార్జున, విజయశాంతి నటించిన ‘జానకి రాముడు’ కూడా ఇలాంటి నేపథ్యంలో వచ్చిన సినిమా.  ఇలా టాలీవుడ్ లోనే కాదు ఇతర భాషల్లో కూడా ఈ తరహా సినిమాలు తెరకెక్కాయి.  ఇక టాలీవుడ్ లో వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుంటూ వెళ్తున్న నేచురల్ స్టార్ నాని తాజాగా 'శ్యామ్ సింగ రాయ్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.  

 

నాని పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని టైటిల్ పోస్టర్ ను కూడా వదిలారు. ఆ మద్య విజయ్ దేవరకొండతో టాక్సీవాలా లాంటి హర్రర్, థ్రిల్లర్ తో మంచి విజయం అందుకున్న రాహూల్  ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తాజాగా అందుతున్న సమాచారం మేర ఈ సినిమాలో రెండు ప్రేమకథలు ఉంటాయని తెలుస్తోంది. ఈ రెండు ప్రేమకథల మధ్య పునర్జన్మకి సంబంధించిన లింక్ ఉంటుందని అంటున్నారు. ఇది పునర్జన్మల నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది.  అంటే ఈ మూవీలో నాని రెండు రకాల పాత్రల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.

 

అయితే కథ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునే నాని ఈ కథ గురించి బాగా స్టడీ చేసే ఒప్పుకుని ఉంటాడని తెలుస్తుంది.  కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను పలకరించనున్నాడనే విషయం మాత్రం అర్థమవుతోంది. ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు.  నాని నిర్మాతగా వ్యవహరించిన ‘హిట్ ’ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే  ఈ మూవీ భారీ అంచనాలు పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: