పిండికి తగ్గ రొట్టె అన్నట్టు.. క్రేజ్ ను బట్టి రెమ్యునరేషన్ ఉంటుంది. స్టార్ హీరో సినిమా రిలీజైన రోజే 30 నుంచి 40కోట్లు కలెక్ట్ చేస్తాయి. యంగ్ హీరోల సినిమాలు హిట్ అయితే 30 నుంచి 40కోట్లు రాబడతాయి. మరి ఈ లెక్కలన్నీ వేసుకుంటే యంగ్ హీరోల రెమ్యునరేషన్ ఎలా ఉంటుందో తెలుసా..

 

ఆ మధ్య నాని పేరు చెబితే చాలు.. సక్సెస్ కు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. వరుసగా ఎనిమిది హిట్స్ అందుకున్న అరుదైన రికార్డ్ నాని సొంతమైంది. ఈ కంటిన్యూ హిట్స్ రెమ్యునరేషన్ పెంచేశాయి. రీసెంట్ గా ఫ్లాపులు వచ్చినా.. రెమ్యునరేషన్ మాత్రం 10కోట్లకు తగ్గడం లేదు. 

 

నాని రెమ్యునరేషన్ తో పోటీపడుతున్న మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ.  అర్జున్ రెడ్డి హిట్ తో విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ కు రెక్కలొచ్చాయి. గీత గోవిందం 70కోట్లు కలెక్ట్ చేయడంతో.. 10కోట్ల మార్క్ చేరాడు ఈ యంగ్ క్రేజీ హీరో. 

 

వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత విజయ్ దేవరకొండ పూరీ దర్శకత్వంలో నటిస్తాడు. ఈ మూవీతో విజయ్ హిందీలోకి అడుగుపెడుతున్నాడు. కరణ్ జోహార్ తో కలిసి పూరీ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీ కావడంతో.. రెమ్యునరేషన్  మరింత పెరుగుతుందని అంచనా.

 

స్టార్ హీరోల రెమ్యునరేషన్ 40 నుంచి 50కోట్లు ఉంటే.. యంగ్ హీరోల రెమ్యునరేషన్ ఇందులో సగంలో సగం కూడా ఉండటం లేదు. అయితే హీట్ పడితే రెమ్యునరేషన్ పెరిగినట్టే. 4.. 5కోట్లు తీసుకునే నాగచైతన్యకు మజిలీ హిట్ తో 8కోట్లు ఇస్తున్నారట. 

 

ఇస్మార్ట్ శంకర్ రామ్ ను కొత్తగా చూపించడమే కాదు.. రెమ్యునరేషన్ లో మార్పు తీసుకొచ్చింది. యూ ట్యూబ్ లో రిలీజయ్యే రామ్ సినిమాల హిందీ డబ్బింగ్ కు మాంచి క్రేజ్ ఉంది. ఎక్కువ వ్యూస్ రావడం.. ఇస్మార్ట్ సక్సెస్ తో రామ్ రెమ్యునరేషన్ 8కోట్లకు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: