దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు హైలెట్ అవుతున్నాయి. దిశ చట్టం, రివర్స్ టెండరింగ్ ఇంకా అనేక విషయాలలో జగన్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. అంతేకాకుండా జగన్ తీసుకొచ్చిన ఈ చట్టాలు ఈ ఐడియాలను ఇప్పటికే దేశంలో ఉన్న కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రంలో అమలు చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పైగా ఆర్థికంగా కూడా బలహీనంగా ఉన్న రాష్ట్రం లో ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధిని జగన్ చేయడం పట్ల చాలామంది జాతీయ స్థాయిలో ఉన్న నాయకులు ఆశ్చర్యపోతున్నారు.

 

అంతేకాకుండా త్వరలో దేశంలో ఏ రాష్ట్రంలో పేదలకు ఇవ్వలేని ఇళ్ల స్థలాలు ఆంధ్రాలో ఇవ్వబోతున్న జగన్ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే తన ప్రభుత్వంలో అనేక విషయాలలో తన సొంత నిర్ణయాలు అమలు చేసిన జగన్ ఆ ఒక్క విషయంలో మాత్రం కేజ్రీవాల్ ని జగన్ ఫాలో అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మొహల్లా క్లీనిక్ పేరుతో క్లినిక్ లను ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో ఉంచారు.  ఈ క్లినిక్ లు ప్రజలకు చేరువయ్యాయి.

 

దీంతో ఇటీవల ఇలా ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేజ్రీవాల్ కి ఈ క్లినిక్ కాన్సెప్ట్ బాగా కలిసొచ్చింది. దీంతో చాలావరకు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ పథకం వల్ల ఓటు వేసినట్లు సర్వేలో తేలింది. ఇప్పుడు ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొహల్లా క్లినిక్ లాంటివే కొన్ని క్లినిక్ లను ఏర్పాటు చేయటానికి జగన్ రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ క్లినిక్ లకు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ పేరుతో రాబోయే ఆర్థిక సంవత్సరం నాడు ప్రారంభించబోతున్నారు అని వైసీపీ పార్టీలో వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా గ్రామ సచివాలయ పరిధిలో క్లినిక్ పనిచేసేలా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు వచ్చే ఏడాది నుండి ప్రారంభించబోతున్నాట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: