పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ హిట్టయిన ప్రేమకథా చిత్రం `తొలి ప్రేమ`. ఈ చిత్రం అప్పట్లో ఎటువంటి సంచలనాన్ని సృష్టించిందో.. అందరికీ తెలిసిందే.  ఆ సినిమా కేవలం పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదు, అందుల్లో నటించిన కీర్తిరెడ్డి కి కూడా చాలా మెమరబుల్ ఫిల్మ్. తెలుగులో హీరోయిన్ గా చేసింది కొన్ని సినిమాలే అయినా, ఆమె ఇంకా తెలుగోళ్లకు గుర్తుందంటే, కారణం తొలిప్రేమ సినిమాయే.  హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ చిత్రాలలో నటించిన కీర్తి రెడ్డి గన్ షాట్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. 

 

ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో తొలి ప్రేమ‌, రావోయి చందమామ చిత్రంలో నాగార్జున స‌ర‌స‌న హీరోయిన్‌గా, అర్జున్ చిత్రంలో మ‌హేష్ బాబుకు చెల్లెలుగా నటించి అతి త‌క్కువ కాలంలోనే మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్ర‌మంలోనే అక్కినేని నాగార్జున మేనల్లుడు, నటుడు సుమంత్ ను 2004లో పెళ్లాడింది.  కానీ సుమంత్, కీర్తి రెడ్డి వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లయి రెండేళ్లు తిరిగేలోపే ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అయితే దీనికిఇద్ద‌రి వ్య‌క్తిత్వాల‌తో పాటు జీవితాలు కూడా పూర్తి భిన్న‌మ‌ని వారిద్ద‌రూ తెలుసుకోవ‌డ‌మేన‌ట‌. 

 

క‌లిసి ఉండ‌లేమ‌ని భావించిన వీరిద్దరూ ఉమ్మ‌డి అంగీకారంతో.. సుహృద్భావ వాతావరణంలో విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఇక ఆ తర్వాత కీర్తి రెడ్డి 2014 లో లండన్లో సెటిలైన డాక్టర్ కార్తీక్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా  ఉన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం తన కజిన్ పెళ్లికి కీర్తి హాజరవడంతో, ఆమె ఫోటో బయటికొచ్చింది. తొలిప్రేమ సమయంలో ఆమెకు ఫ్యాన్స్ అయిపోయిన వాళ్లందరూ కీర్తిని చూసి షాక్ అయ్యారు. అప్పుడు అందంగా ఉండే ఆమె ఇపుడు బాగా లావెక్కి ఆంటీలా తయారైంది. 

 

ఆమె లుక్ చూసి ఫ్యాన్స్.. ఆమె కీర్తిరెడ్డి అని గుర్తు ప‌ట్టాడానికి చాలా స‌మ‌య‌మే పట్టింద‌ట. ఎందుకంటే కీర్తిరెడ్డి ఫేస్‌లో మున‌ప‌టి గ్లో లేద‌ని ఆ ఫోటో చూస్తేనే తెలిసిపోతుంది. కీర్తిరెడ్డిలో ఇంత‌క‌ముందు ఉన్న అందాలు ఏమి క‌నిపించ‌డం లేదు. కొత్త రూపంలో కీర్తిరెడ్డిని చూసే స‌రికి షాక్ అవ్వ‌డం అభిమానులు వంతైంది. సినిమాలు మానేసి చాలాకాలం అయిన కీర్తిరెడ్డి మున‌ప‌టిలా ఉండాలంటే కొంచెం క‌ష్ట‌మే. ఏది ఏమైన‌ప్ప‌టికి కీర్తిరెడ్డిలో చాలా మార్పు వ‌చ్చింద‌నేది వాస్త‌వం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: