ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా ఎదుగుతున్న ఓ యంగ్ బ్యూటీ ప్రేమపై మనసు పారేసుకుంటోంది. లవ్ లో ఉందో లేదో అనే విషయం క్లారిటీ ఇవ్వకుండా ఎప్పటికైనా లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటోంది. అది కూడా సినిమాటిక్ లవ్ మ్యారేజ్ కావాలంటూ కలలు కంటోంది. 

 

ఫాదర్ ప్రముఖ దర్శకుడు కావడంతో కళ్యాణి ప్రియదర్శన్ ఇండస్ట్రీలోకి ఈజీగానే ఎంట్రీ ఇచ్చింది. హలో చిత్రంతో టీటౌన్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ కేరళ కుట్టికి తొలి సినిమా చేదునే మిగిల్చింది. లాస్ట్ ఇయర్ రిలీజైన చిత్రలహరి కళ్యాణి ప్రియదర్శినీ మంచి సక్సెస్ అందించింది. హిట్, ఫ్లాప్స్ తో కెరీర్ పరంగా ఎలాంటి డెవలెప్ మెంట్ లేని ఈ బ్యూటీకి పెళ్లి గాలి మళ్లినట్టుంది. 

 

తాజాగా కళ్యాణి ప్రియదర్శిని మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఈ యంగ్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తాను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది. అయితే ఇప్పటి వరకు తాను ప్రేమలో పడలేదంటోంది. కానీ ఎప్పటికైనా ప్రేమ పెళ్లే చేసుకుంటానంటోంది. అంతేకాదు సినిమాల్లో మాదిరి సినిమాటిక్ లవ్ కావాలని ఈ బ్యూటీ డ్రీమ్ అంటోంది.

 

ఇక సినిమాల విషయానికొస్తే కళ్యాణి ప్రియదర్శిని ఫాదర్ ప్రియదర్శన్ దర్శకత్వంలో నటించాలని లేదట. గతంలో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తే చాలా టన్షన్ పడ్డాడట. అందుకే మరోసారి ఆయన దర్శకత్వంలో చేయాలనుకోవడం లేదని చెబుతోంది. తెలుగులో ఛాన్స్ లు లేని కళ్యాణి తమిళ మళయాళంలో మాత్రం రెండు సినిమాలు చేస్తోంది. కెరీర్ పరంగా సక్సెస్ లేకపోవడంతో ఈ బ్యూటీ లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటుందేమో మరి. 

 

యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శిని తన మనోగతాన్ని విప్పడంతో కుర్రకారు ఫుల్ జోరులో ఉన్నారు. తనను ప్రేమించే ఆ లక్కీ ఫెలో ఎవరో అంటూ గుసగుసలాడుకుంటున్నారు. చేసుకుంటే ప్రేమ పెళ్లే చేసుకుంటానని ఆ బ్యూటీ చెప్పడంతో ఒకింత ఆనందానికి లోనవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: