సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇపటి వరకు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి. తన సక్సస్ ట్రాక్ రికార్డ్ చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు పిలిచి మరీ అనిల్ రావిపూడికి మంచి ఛాన్స్ ఇచ్చాడు. దాంతో అనిల్ రావిపూడి మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమాని తీసి చాలా వరకు సక్సస్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అనిల్ సూపర్ స్టార్ ని ఎఫ్ 3 కోసం అడిగాడట. సరిలేరు సమయంలోనే అనిల్ కి మహేష్ బాబు కూడా నీతో ఇంకో సినిమా చేత్సానని మాటిచ్చారని అఫీషియల్ గానే చర్చించుకున్నారు. ఇప్పుడు అదే నిజం చేశారు అనిల్ రావిపూడి, మహేష్ బాబు. 

 

అనీల్ రావిపూడి ఎంతో కష్ఠపడి ఈ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసుకుంటున్నాడు. 2018 సంక్రాంతికి రిలీజైన ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక ఆ సినిమాకి సీక్వెల్ తీస్తామని అనీల్ రావిపూడి- దిల్ రాజు అప్పట్లోనే ప్రకటించేశారు. ఈ నేపథ్యంలోనే ఎఫ్ 3 స్క్రిప్టును ప్రిపేర్ చేయడంలో అనీల్ రావిపూడి టీం బిజీగా ఉన్నారు. ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3లో వెంకీ- వరుణ్ లతో పాటు మూడో హీరో ఉంటారు అన్న ప్రచారం జోరందుకున్నాక ఆ పాత్రకు మాస్ మహారాజా రవితేజను సెలక్ట్ చేసుకున్నారని రూమర్స్ వచ్చాయి. 

 

అయితే అది రూమరే అని కొద్ది రోజుల్లోనే తేలిపోయింది. మళ్ళీ అనిల్ రావిపూడి మహేష్ బాబు తో సినిమా చేయబోతున్నారని.. అది ఎఫ్ 3 అని కూడా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు సినిమా చేసే సమయంలోనే అనీల్ రావిపూడికి మహేష్ మరో సినిమాని ఆఫర్ చేశారు. అయితే అది సరిలేరు సీక్వెల్ అన్న ప్రచారం సాగుతుండగానే.. అందులో వాస్తవం లేదని సూపర్ స్టార్ ఎఫ్ 3 కోసమే రోజుల కాల్షీట్లు ఇచ్చేశారని తాజా సమాచారం. మే 2020 నుంచి ఎఫ్ 3 షూటింగ్ మొదలవుతుందని మళ్ళీ మహేష్ సరసన రష్మిక ఆడి పాడనుందని అన్నారు. అనిల్ రావుపూడి రాసుకున్న ఎఫ్ 3 కథ కథనం మహేష్ బాబుకి విపరీతంగా నచ్చాయట. దాంతో పదా మనం ఎఫ్ 3 చేసేద్దాం అని అనిల్ కి కన్‌ఫర్మేషన్ ఇచ్చారు మహేష్ బాబు. ఇదీ అఫీషియల్ న్యూస్. సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: