టాలీవుడ్లోకి ఎంతో మంది కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం సీనియర్ హీరోలు గా ఉన్న నాగార్జున వెంకటేష్ చిరంజీవి బాలకృష్ణ వీళ్ళ ఫామిలీ నుంచి వారసులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్న హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి అయితే అరడజను మంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం తమ  ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లు ఎన్నో ఏళ్ల క్రితమే ఏంట్రీ  ఇవ్వగా ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. ఇక వెంకటేష్ ఫ్యామిలీ నుంచి రానా దగ్గుబాటి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి నాగచైతన్య అఖిల్ ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు. 

 

 

 అయితే ఇలా సినిమా బ్యాగ్రౌండ్ తో  తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోలు కొంతమంది అయితే ఇప్పటికీ విజయాల కోసం పాకులాడుతున్న హీరోలు కొంతమంది. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే నానుడికి టాలీవుడ్ లో సరిగ్గా సరిపోయే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది అక్కినేని  అఖిల్ . హీరోగా సరిపోయేందుకు అక్కినేని అఖిల్ కు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. చూడటానికి చక్కగా ఉంటాడు.. తెల్లతోలుతో  అమ్మాయిల అందరికీ నచ్చేలా అబ్బాయిలు మెచ్చేలా ఉంటాడు. ఇక అక్కినేని ఫ్యామిలీలో కాస్తో కూస్తో డాన్సులు చేస్తుంది అంటే అఖిల్ అనే చెప్పాలి.  ఇక సినిమా బ్యాక్ గ్రౌండ్ కూడా తక్కువేమీ లేదు తాతల కాలం నుంచి భారీగానే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంది. 

 

 

 అన్నీ ఉన్నాయి కానీ ఈ హీరో మాత్రం విజయం సాధించలేక పోతున్నారు. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తనని తాను తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోలేక పోతున్నాడు అక్కినేని అఖిల్. వరుసగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం అంతగా ఆదరించలేదు. దీంతో మూడు సినిమాలు డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. కనీసం యావరేజ్ టాక్  కూడా తెచ్చుకోలేదు. ఇక ఇప్పుడు నాగార్జున అఖిల్ కెరీర్ ను సెట్  చేసే పనిలో పడ్డారు. దీంతో నాగార్జున కథలు విని అఖిల్ కోసం సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ తో అక్కినేని అఖిల్ సినిమా చేస్తుండగా ఈ సినిమా అయినా విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: