టాలీవుడ్ లో హీరోలకు ఎక్కడా కొదవలేదు. ప్రస్తుతం ఎంతో మంది సీనియర్ హీరోలతో పాటు చాలా మంది జూనియర్ హీరోలు కూడా తమ సత్తా చాటుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులందరికీ ఎక్కడ సినిమాల కొదవ లేదని చెప్పాలి. ప్రతి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదో ఒక సినిమా విడుదల అవుతూ ఉంటుంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఉన్న హీరోలు సీనియర్ హీరోల ఫ్యామిలీ నుంచి వారసులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చిరంజీవి వెంకటేష్ నాగార్జున బాలయ్య ఈ నలుగురు హీరోలు ఫ్యామిలీల నుంచి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న హీరోలు ఎంతో మంది. 

 

 

 అయితే కొంతమంది హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ  ఇచ్చినప్పటికీ ఇప్పటికీ సరైన స్టార్ డమ్  మాత్రం సంపాదించుకోలేక పోయారు. ఇలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సింది మంచు ఫ్యామిలీ నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్,  మంచు విష్ణు. ఇద్దరు హీరోలు చేసినవి చాలా సినిమాలు. ఎన్నో విభిన్నమైన పాత్రలు.. కానీ ఇద్దరికీ మాత్రం సరైన  స్టార్ డమ్  మాత్రం రాలేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఇప్పటికి తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు మోహన్ బాబు తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగించి కలెక్షన్ కింగ్ అంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

 

 

 కానీ మంచు వారి వారసులు మాత్రం ఇంకా స్టార్ డమ్  కోసం పాకులాడుతూ ఉన్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అఖిల్. తాతల కాలం నుంచి ఉన్న భారీ బ్యాక్గ్రౌండ్ కూడా అఖిల్ కు సక్సెస్ ను సాధించి పట్టలేకపోయింది. నాగార్జున వారసుడిగా అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా నాగచైతన్య తమ్ముడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ  ఇచ్చినప్పటికీ అఖిల్ మాత్రం సక్సెస్ సాధించలేకపోయాడు. నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అఖిల్ మాత్రం ఇప్పటికీ గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నాడు. మరో హీరో అల్లు శిరీష్.. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు గా స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి  ఒక గుర్తింపు లేకుండానే ఉన్నాడు అల్లు శిరీష్.

మరింత సమాచారం తెలుసుకోండి: