తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి సంచలన విజయాలను సొంతం చేసుకుని ఫ్యామిలీ ఆడియన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రాజశేఖర్. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా.. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి... ఫ్యామిలీ హీరోగా మారిపోయాడు. ఇక అంతే కాకుండా ఎన్నో యాక్షన్ సినిమాల్లో కూడా నటించి.. తెలుగు ప్రేక్షకులు అందరినీ అలరించారు. ఇలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు  హీరో రాజశేఖర్. తనదైన స్టైల్ డాన్స్ లు తనదైన చిలిపి నవ్వు.. డైలాగ్ డెలివరీతో ఎంతోమంది అభిమానులను కూడా సంపాదించుకున్నారు. 

 

 

 ఇక ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలు హీరోయిన్ గా  రాణించిన జీవితను  పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రాజశేఖర్... ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో తెలుగు తెరపై కనుమరుగై పోయాడు. కానీ ఎన్నో ఏళ్ల తర్వాత మరోసారి తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చి.. తన సత్తా ఏంటో చూపించాడు హీరో రాజశేఖర్. అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో మంది కొత్త హీరోలతో.. ఉన్నప్పటికీ హీరో రాజశేఖర్ మాత్రం రీ ఎంట్రీ సినిమాతోనే విజయం సాధించారు.. గరుడవేగ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి తన సత్తా చాటి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత తీసిన కల్కి  సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. 

 

 

 ఇదిలా ఉంటే హీరో రాజశేఖర్ ఇప్పుడు వరకు ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఏ ఒక్క సినిమాలో కూడా తనకు తాను డబ్బింగ్ చెప్పుకోలేదు. ప్రతి సినిమాలో హీరో సాయికుమార్ రాజశేఖర్ కి డబ్బింగ్ చెప్పే వాడు. సెంటిమెంట్ సీన్లలో ఆయన యాక్షన్  సీన్లలో అయినా హీరో సాయికుమార్ రాజశేఖర్ కి డబ్బింగ్ చెబుతూ ఉండేవాడు. అయితే రాజశేఖర్ తన సినిమాలకు డబ్బింగ్ చెప్పక పోవడానికి కారణం ఏమిటి అంటే... రాజశేఖర్ వాయిస్ లో సరిగ్గా లేకపోవడం.. రాజశేఖర్ వాయిస్ హీరో కి సరిగ్గా సెట్ అవ్వదు అని దర్శక నిర్మాతలు భావించి సాయి కుమార్ ని డబ్బింగ్ చెప్పించారు  అని ఒక టాక్ కూడా ఉంది. అంతేకాకుండా రాజశేఖర్ కి అప్పట్లో తెలుగు కూడా సరిగా వచ్చేది కాదు అందుకే సాయి కుమార్ తో డబ్బింగ్ చెప్పించేవారట దర్శకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: