తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే సినిమాల్లో రాణించాలి అంటే కచ్చితంగా ప్రతిభ కాస్తో కూస్తో ఉండాలి. సరే ప్రతిభ ఉన్నా సరే చేసే సినిమాల కథల విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ప్రస్తుతం ప్రతిభ ఉన్నా సరే కథల ఎంపికలో జాగ్రత్త లేక ఇబ్బంది పడుతున్న హీరో మంచు మనోజ్. తన తండ్రి ఇమేజ్ మనోజ్ కి ఉపయోగపడినా పడకపోయినా అతను సినిమాల్లో నిలబడలేకపోతున్నాడు. కథల విషయంలో సరైన ఎంపిక లేకపోవడమే దీనికి కారణమని అంటున్నారు. 

 

మాస్ సినిమాలు అనేవి ఇప్పుడు పెద్దగా చూడటం లేదు. సినిమాలో హీరోయిజం అనేది కూడా పెద్దగా ఉపయోగపడటం లేదు ఈ రోజుల్లో. సినిమా కథకు పట్టు ఉంటే చాలు ఆ సినిమా బాగా ఆడుతుంది. లేకపోతే ఫ్లాప్ అవుతుంది. ఈ విషయ౦ తెలుసుకోకుండా సినిమాలు చేసాడు మనోజ్. దాదాపు గత ఆరేళ్ళ నుంచి కథల్లో హీరో ఎలివేషన్ కంటే కూడా కథలో కామెడి లేదా సరైన లవ్ స్టొరీ, కథ భిన్నంగా ఉంటే సినిమా మంచి విజయం సాధిస్తుంది. అది తెలుసుకున్న హీరోలు మంచి విజయాలు నమోదు చేస్తున్నారు. 

 

ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేని నానీ లాంటి వాళ్ళు, శర్వానంద్ లాంటి వాళ్ళు మంచి కథలతో సినిమాలు చేస్తున్నారు. ఇక నాగచైతన్య లాంటి వాళ్ళు కూడా కథలో పట్టు చూసుకుని సినిమాలు చేస్తున్నారు. కాని మనోజ్ మాత్రం అలా చేయలేకపోతున్నారు అనే విమర్శ ఉంది. ఈ రోజుల్లో క్లాస్ గా సినిమా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే చాలా మంది హీరో లు కూడా దర్శకులు అలాంటి కథలు తెస్తే ఓకే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఫైట్స్ కూడా సినిమాల్లో చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఒకటి రెండు ఫైట్స్ మినహా పెద్దగా పెట్టడం లేదు. కాని మనోజ్ సినిమాల్లో అవి ఎక్కువ.

మరింత సమాచారం తెలుసుకోండి: