నేచురల్ స్టార్ నాని చాలా జాగ్రత్తగా తన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో మంచి ఊపులో ఉన్నాడు. ప్రస్తుతం నాని 'వీ' అనే చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్న బిజీగా ఉన్నాడు. నాని ను తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన మోహన్ క్రిష్ణ ఇంద్రగంటి అతనిని తొలిసారి విలన్ గా చూపించనున్నాడు. సినిమాలో మరో యంగ్ హీరో సుధీర్ బాబు కథానాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. అయితే సినిమా తర్వాత నానికి 'నిన్ను కోరి' లాంటి మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో నాని మళ్లీ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.

 

అయితే చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సినిమా టైటిల్ ను 'టక్ జగదీష్' అని చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగా చిత్రం కథ సెన్సేషనల్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన అగ్నినచ్చత్రం (తెలుగులో ఘర్షణ) అనే సినిమా కథను పోలి ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

 

సినిమాలో ఇద్దరు అన్నదమ్ములు తమ తండ్రి ఆస్తికి ఆమె అసలైన వారసులమంటూ వచ్చి ఎలా గొడవ పడతారన్న విషయం ఆధారంగా తెరకెక్కుతోందని చెబుతున్నారు. అచ్చం ఇలాంటి కాథనే మణిరత్నం మనకు గతంలో చూపించాడు. అయితే శివ నిర్వాణ కథకు కాస్త మార్పులు చేర్పులు చేసి తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండే కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడట.

 

ఇంతకుముందు 'మజిలీ' సినిమా దర్శకత్వం వహించిన శివ…. కమల్ హాసన్ సాగర సంగమం చిత్రంలోని కథకు మార్పులుచేర్పులు తీసినట్టు ఉందని చాలా విమర్శలు వచ్చాయి.

 

మరి టక్ జగదీష్‌కు సోదరుడిగా ఎవరు నటిస్తారా అనే అంశంపై కూడా ఇండస్ట్రీ వర్గాల్లో క్లారిటీ వచ్చింది. సినిమాలో జగపతి బాబు కూడా కీలకపాత్రలో నటిస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి.

 

మరి వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: