టాలీవుడ్ హీరోలు ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అనేది అందరికి తెలిసిన విషయమే. వాటికి మార్కెట్ ఎక్కువగా ఉన్న నేపధ్యంలో మన హీరోలు ఆ విధంగా ప్రయత్నాలు చేయడం మొదలుపెట్టారు. ఇక దర్శక నిర్మాతలు కూడా దానిపై ఎక్కువగా దృష్టి సారిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రచారాలు టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా వస్తున్న గాసిప్ నందమూరి కుటుంబం మల్టీ స్టారర్. ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని కథనాలు ఎక్కువగా వచ్చాయి. 

 

బాలకృష్ణ సినిమాలకు దూరమవుతున్నారని, ఈ సినిమా బాలకృష్ణ కల అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అందుకే ఎన్టీఆర్ ని త్రివిక్రమ్ కూడా అడగగా అందుకు ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడని ఈ సినిమా ద్వారానే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉంటుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియలేదు. కాని ఇటీవల సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చినప్పుడు ఇది కేవలం ప్రచారం అని మాత్రమే వచ్చింది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుంది. ఆ సినిమాలో బాలకృష్ణ ఉన్నట్టు ఏ ప్రకటనా లేదు. 

 

ఇక బాలకృష్ణ కూడా మరో సినిమా చేస్తున్నారు. ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ సినిమా షూటింగ్ కి కూడా వెళ్ళింది. ఇది కేవలం సోషల్ మీడియాలో ప్రచారమే అనే విషయ౦ అర్ధమైంది. ఏది ఎలా ఉన్నా నందమూరి హీరోలు కలవాలి అని ఎదురు చూస్తున్న అభిమానులకు మాత్రం ఈ వార్త ఎక్కువగా కిక్ ఇచ్చింది. ఆ సినిమా కోసం చాలానే ఎదురు చూస్తున్నారు అభిమానులు. అక్కినేని కుటుంబం నుంచి మనం వచ్చింది అని మరి ఈ కుటుంబం నుంచి ఎం వస్తుంది అంటూ ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: