తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరు ఎంత ప్రత్యేకమైనదో అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవ‌లం స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన.. అనతి కాలంలోనే స్టార్‌గా ఎదగలేదు. ఎన్నో కష్టానష్టాలను అనుభవించిన తర్వాతే ఉన్నత స్థానానికి చేరుకున్నారు. నటనలో ఆయనకు ఆయనే సాటి. చిరంజీవి అంటే అంద‌రికీ ముందుగా గుర్తొచ్చేది డాన్సులు.. ఫైట్లు.. డైలాగులే. ఇక తెలుగులో ఈయ‌న చేసిన‌న్ని ప్ర‌యోగాలు ఆయ‌న త‌రంలో మ‌రే హీరో చేయ‌లేదు. చిరంజీవి తన తొలినాళ్లలో అందరిలానే యాక్టింగ్‌పైనే దృష్టి సారించారు. అందుకే ఏ పాత్ర అయినా చేసేందుకు సిద్ధం అయ్యారు. కొన్ని సినిమాల్లో విలన్‌గా కూడా కనిపించారు. 

 

అయితే ఒక్కసారి ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఆయన వెనుదిరిగి చూడలేదు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయారు. ఇక ఈ విష‌యం ప‌క్క‌న పెడితే సినిమా ఇండ‌స్ట్రీలో ఏదైనా విష‌యం జ‌రిగినా.. జ‌ర‌గ‌క‌పోయినా రూమ‌ర్లు సృష్టించే వారు ప్ర‌స్తుతం లెక్క‌కు మిక్కిలిగా ఉన్నారు. సినీ తార‌ల ఎఫైర్లో, గొడ‌వ‌లో ఇలా అనేక ర‌కాల విష‌యాల‌పై ఏదో ఒక వార్త వ‌స్తుండ‌డం.. అది హాట్ టాపిక్‌గా మార‌డం స‌ర్వ సాధార‌ణం అయిపోయింది. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. చిరు ఆ హీరో చెంప ఎందుకు చెళ్లుమ‌నిపించాడు. టాలీవుడ్‌లో ఆయ‌నో యంగ్ హీరో. ఇప్ప‌టికే ఈయ‌న ఎన్నో సినిమాలు చేసి ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తించుకున్నాడు. 

 

అలాగే మాస్ హీరోగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈ హీరో చిరంజీవికి త‌మ్ముడుగా ఓ చిత్రంలో న‌టించాడు. అయితే స‌ద‌రు హీరో షూటింగ్ స్పాట్‌లో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో బాగా ఓవ‌ర్ యాక్ష‌న్ చేయ‌డం వ‌ల్ల స‌హ‌నం కోల్పోయిన చిరంజీవి అత‌ని చెంప చెళ్లుమ‌నిపించార‌ని అప్ప‌ట్లో తెగ‌ ప్ర‌చారం జ‌రిగింది. అయిన‌ప్ప‌టికీ ప్ర‌వ‌ర్త‌న మార్చుకోని స‌ద‌రు హీరో మ‌రో స్టార్ హీరో చేతుల్లో మ‌ళ్లీ చెంప దెబ్బ తిన్న‌ట్టు ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ సైడ్ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఇది ఎంత వ‌ర‌కూ నిజం అన్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు స్ప‌ష్ట‌త అయితే రాలేదు. 


  

మరింత సమాచారం తెలుసుకోండి: