జయం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమై ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో నితిన్. తనదైన కామెడీ టైమింగ్ తో అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు నితిన్. ఇక వరుస సినిమాలు చేసుకుంటూ అద్భుతంగా దూసుకుపోతున్నారు. అయితే తాజాగా భీష్మ సినిమా తో సంచలన విజయం అందుకున్న నితిన్.. అదే జోష్ లో త్వరలో పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నాడు నితిన్. అయితే జయం సినిమాతో నితిన్ ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు అనే చెప్పాలి. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం  సినిమాలో నితిన్ సరసన హీరోయిన్ గా సదా  నటించగా గోపీచంద్ విలన్ గా  నటించారు. ఈ సినిమా అప్పట్లో ఫ్యామిలీ ప్రేక్షకులను ఎంతగానో అలరించి  సంచలన విజయాన్ని నమోదు చేసింది. 

 

 

 ఈ సినిమాలో  నితిన్ అమాయకుడిగా ఎంతో బాగా నటించి ఎన్నో ప్రశంసలు కూడా అందుకున్నారు. ఇక మొదటి సినిమా తర్వాత డైరెక్టర్ తేజ ను గురువుగా భావించి నితిన్... ఎంతో భయం భక్తితో డైరెక్టర్ తేజ తో ఉండేవాడు. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ తేజ తో ధైర్యం అనే సినిమాలో హీరోగా నటించాడు నితిన్. ఈ సినిమా ఎన్నో వివాదాల మధ్య తెరకెక్కింది. ఇక ఈ సినిమా విడుదల ఎన్నో రోజుల పాటు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదలపై కాస్త అసంతృప్తికి లోనైన నితిన్ తండ్రి.. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఎటూ కాకుండా పోతుందనే ఉద్దేశ్యంతో విడుదల తేదీని డైరెక్టర్ తేజ సంప్రదించకుండానే ప్రకటించేశారు. అయితే ఈ సినిమాలో కొన్ని పాటలు సీన్లు మార్పులు చేయాలని తేజ మాత్రం విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. 

 

 

 అయినప్పటికీ నితిన్ తండ్రి మొండిపట్టు తో సినిమా విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై కాస్త కోపంగా ఉన్న డైరెక్టర్ తేజ... ఈ సినిమా కొనడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ లు  సినిమా ఎలా ఉందండి అని అడిగితే.. ఇప్పుడు బాగానే ఉన్నావు కదా కుటుంబం కూడా సంతోషంగా ఉంది కదా మరి ఈ సినిమా కొనడానికి ఎందుకు వచ్చావ్ అంటూ తన సినిమాపై తానే  నెగెటివ్ గా చెప్పడం ప్రారంభించాడు. ఇక ఈ విషయం కాస్త నితిన్ తండ్రి వరకు వెళ్లడంతో వారిద్దరూ కలిసి ఫిలింఛాంబర్లో డైరెక్టర్ తేజ పై ఫిర్యాదు చేయగా టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి కోటి రూపాయల నష్టపరిహారాన్ని నితిన్ తండ్రికి నితిన్ కి  ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. నేను ఇవ్వను అని డైరెక్టర్ తేజ ఎంత చెప్పినప్పటికీ ముక్కుపిండి మరీ నితిన్  తండ్రి కోటి రూపాయలు డైరెక్టర్ తేజ నుంచి వసూలు చేశారు. ఇలా తనకు హిట్ ఇచ్చిన దర్శకుడు దగ్గర నుంచి నితిన్ కోటి రూపాయల నష్టపరిహారాన్ని వసూలు చేశారు. ఆ తర్వాత విడుదలైన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: