సినీ పరిశ్రమలో స్టార్ హీరోల తమ నటనలో ఎప్పుడూ వైవిధ్యం ఉండేలా చూస్తుంటారు.  అంతే కాదు కొంత మంది తమ వేషదారణలో ప్రయోగాలు కూడా చేస్తుంటారు.  ఒకప్పుడు అక్కినేని నాగేశ్వరరావు 'నవరాత్రి' అనే సినిమాలో తొమ్మిది రకాల వేషధారణల్లో కనిపించి ఆశ్చర్యపరిచారు.  అయితే కమల్ హాసన్ లాంటి హీరోలు ఆ వేషదారణ ఎంతో నేచురల్ గా కనిపించేలా చూస్తూ ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు.  విచిత్ర సోదరులు మూవీలో పాట్టివాడిగా నటించాడు కమల్.   'దశావతారం'లో  ఏకంగా పది పాత్రలతో ముచ్చట తీర్చుకున్నాడు.  ఇలాంటి సినిమాలో అప్పట్లో జనాలకు బాగానే నచ్చినా రాను రాను ఈ టైప్ ప్రయోగాల విషయంలో బోర్ కొట్టినట్టు తెలుస్తుంది. 

 

ఇక కమల్ హాసన్ తరహాలో విక్రమ్ కొన్ని ప్రయోగాత్మక పాత్రల్లో నటించారు.  శంకర్ దర్శకత్వంలో ‘ఐ’ సినిమాలో కురూపిగా నటించారు విక్రమ్. గత కొంత కాలంగా విక్రమ్ ఈ తరహా సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తున్నారు.  అయితే ఈ తరహా పాత్రల్లో ప్రతిసారి కనిపించడంతో ప్రేక్షకులు పరమ బోర్ ఫీల్ అవుతున్నారు.  డీమాంటి కాలనీ, అంజలి ఐపీఎస్ లాంటి డిఫరెంట్ థ్రిల్లర్లు తీసిన అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ ‘కోబ్రా’ మూవీతో వస్తున్నారు.  అయితే ఈ మూవీలో విక్రమ్ ఏడు రకాల పాత్రలో కనిపించబోతున్నారట. ఒక పాత్రకు మరో పాత్ర అసలు సంబంధంమే ఉండదట. ఆ మద్య  'అరిమా నంబి' అనే సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్ శంకర్.. విక్రమ్‌తో సినిమా అనేసరికి 'ఇరు ముగున్' (ఇంకొక్కడు) అనే డిజాస్టర్ తీశాడు. 

 

తెరపై విఫరెంట్ లుక్ తో కనిపించాలనే కుతూహలం ఉన్న విక్రమ్ ఇలాంటి కథలు బాగానే ఎంచుకుంటున్నారు.  తాజాగా  కోబ్రా తో మరో  కొత్త తరహా ప్రయోగానికి సిద్దమవుతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు.  లుక్ పరంగా ఓకే కానీ కంటెంట్ ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తున్నారు.   ఇలా ఎన్ని వేషాలు వేసినా.. సినిమాలో విషయం ఉంటేనే ఆడుతుందనే విషయం విక్రమ్ అర్థం చేసుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: