డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అంటే అందరికి చాలా ఇష్టం అన్న సంగతి తెలిసందే. మల్లెమాల ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న డాన్స్ రియాలిటీ షో ఢీ కి జడ్జ్ గా వ్యవహరిస్తున్న శేఖర్ మాస్టర్ షోని సక్సస్ ఫుల్ గా రన్ చేయడం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శేఖర్ మాస్టర్ సిగ్నేచర్ స్టెప్స్ ప్రేక్షకులందరిని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్టార్ హీరోలందరికి సూపర్ హిట్ సాంగ్స్ ని కంపోజ్ చేస్తూ ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కొరియో గ్రాఫర్ గా పాపులర్ అయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి, ఎన్.టి.ఆర్, మహేష్ బాబు, రాం చరణ్ ..ఇలా స్టార్ హీరోలందరితో శేఖర్ మాస్టర్ సాంగస్ ని కంపోజ్ చేసి సూపర్ అనిపించుకుంటున్నారు.

 

అలాగే టీవీ షో లతోను శేఖర్ మాస్టర్ నిరంతరం ప్రేక్షకులను ఆకట్టుకుంటూ క్రేజ్ ని సంపాదించుకుంటున్నారు. ప్రియమణి, పూర్ణ, రష్మీ, సుధీర్, ప్రదీప్ లతో కలిసి బుల్లి తెరమీద చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే కొన్ని సార్లు శేఖర్ మాస్టర్ ఆటిట్యూడ్, బిహేవియర్ కి నెటిజెన్స్ నుంచి కామెంట్స్ తో పాటు సెటైర్స్ కూడా పడుతున్నాయి. అమ్మాయీలంటే సిగ్గు పడుతున్నట్టుగా యాక్ట్ చేస్తూనే తనలోని అసలు శేఖర్ మాస్టర్ ని అప్పుడప్పుడు బయటకి తీసుకు వస్తున్నాడు.

 

రీసెంట్ గా ప్రముఖ ఛానల్ లో ప్రసారమవుతున్న లోకల్ గ్యాంగ్ అన్న షోలో శేఖర్ మాస్టర్ రెచ్చిపోయి మరీ అనసూయ తో రొమాంటిక్ డాన్స్ చేశాడు. ఆ మూమెంట్స్ చూసిన జనాలకి వెర్రెక్కిపోయింది. దానికి తో స్లో మోషన్ షాట్స్ ఇంకా ఎఫెక్టివ్ గా అనిపించడంతో ఒక హీరో హీరోయిన్ డాన్స్ చేసినట్టుగా అనసూయ తో శేఖర్ మాస్టర్ డాన్స్ అదరగొట్టాడు. చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు సరదా కామెంట్స్ తో పాటు ఆ రకమైన కామెంట్స్ కూడా పెడుతున్నారట. ఇద్దరికి పెళ్ళై పిల్లలున్నారు కదా మరీ ఇంతగా రెచ్చిపోవాలా ఎంత షో అయితే మాత్రం ఇంత అతి అవసరమా మాస్టర్ అంటూ కాస్త ఘాటుగా విమర్శిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: