సినిమా పరిశ్రమలోకి ఒకసారి ప్రవేశించి ఏదో ఒక శాఖలో మంచి ప్రావిణ్యం సంపాదించి మెల్లగా అందులో అవకాశాలతో ముందుకు సాగి, ఆపై పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఉన్నత స్థానాలకు ఎదిగిన కొందరు ప్రవర్తించే తీరు ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. నిజానికి ఇది కేవలం సినిమా పరిశ్రమలోనే కాదనుకోండి, చాలా శాఖల్లో ఈ తరహా మనుషులు ఉంటూ ఉంటారు. నిజానికి ఒక ఉన్నతమైన హోదాకు వచ్చిన తరువాత మనం ప్రవర్తించే తీరుని బట్టి మనకు మంచి పేరు, గౌరవం దక్కుతుంది అనేది అందరికీ తెలిసిందే. 
 
ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, ప్రస్తుతం టాలీవుడ్ లోని మా అసోసియేషన్ లో పెద్ద హోదాలో కొనసాగుతున్న కొందరి కుమ్ములాటలు ఏ స్థాయికి వెళ్లాయంటే, ఏ మాత్రం చిన్న అదను దొరికితే చాలు ఒకరి వర్గం పై మరొక వర్గం నిందలు వేసేంతలా అంటూ, కొందరు సినీ విశ్లేషకులు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి మొదట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారి దగ్గరి నుండి ఇటీవల కొన్నేళ్ల ముందు నుండి మా లో ఎటువంటి వర్గ పోరు లేదు సరికదా, అసోసియేషన్ సభ్యులందరూ కూడా అధ్యక్షుడి మాటకు కట్టుబడి ఉండేవారట. ఇక రాను రాను రోజులు మారడంతో పాటు అసోసియేషన్ లో విబేధాలు, వర్గ పోరు ప్రవేశించిన తరువాత ఒకరిపై మరొకరు చేసుకునే నిందారోపణలు మరింతగా పెరిగాయట. ఇకపోతే ఇటీవల సీనియర్ నరేష్ అధ్యక్షుడిగా ఎంపికైన సమయంలో జరిగిన వివాదం అందరికీ తెలిసిందే. 
 
ఇక ఇటీవల మా లోని సభ్యుడైన రాజశేఖర్ చిరంజీవి, కృషంరాజు, టిఎస్సార్, మోహన్ బాబు వంటి ప్రముఖులు స్టేజ్ పై ఉండగానే మాలో విబేధాలు ఉన్నాయి, వాటిని అందరూ కప్పిపుచ్చుతున్నారు అంటూ వ్యాఖ్యానించి మరొక భీకర వివాదానికి తెరలేపారు. ఇదంతా ఒకవైపు అయితే, మరోఇక వైపు మాత్రం ఈ రెండు వర్గాల వారు కూడా, పలువురు ఇతర సినీ ప్రముఖుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు విచ్చేసినపుడు మాత్రం ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమ ఒలకబోస్తుంటారని, లోలోపలేమో పీకల్లోతు పగ, పైకి మాత్రం ఇలా ఒకరిపై మరొకరికి కారిపోయేంత ప్రేమ ఉన్నట్లు ఇచ్చే బిల్డప్ లు చూస్తుంటే సాధారణ ప్రజలకు వీళ్ళు సినిమాల్లోనే కాదు బయట కూడా బాగా నటిస్తారని అనిపించకమానదని పలువురు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: