బాహుబలి తర్వాత రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలిని మించి అంచనాలు పెరిగిపోతున్న ఈ  చిత్రం గురించి సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాహుబలి క్రియేట్ చేసిన బిజినెస్ గానీ, ఇంపాక్ట్ గానీ బద్దలు కొట్టేలా ఆర్.ఆర్.ఆర్ కనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు.

 

 


సినిమా షూటింగ్ మొదలై సంవత్సరం కావొస్తున్నా ఇప్పటి వరకు సినిమాలో ఎన్టీఆర్ లుక్ కానీ, రామ్ చరణ్ లుక్ కానీ బయటకు రాలేదు. కొమరం భీంగా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ ఆతృతతోనే తామే ఎన్టీఆర్ లుక్ ని ఊహించేసుకుని పోస్టర్లు తయారు చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. సినిమా విడుదలకి ఇంకా సంవత్సరం టైమ్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడే ఎలాంటి లుక్స్ విడుదల చేయరని తెలుస్తుంది. 

 

 


అయితే తాజాగా ఎన్టీఆర్ లుక్ బయటకి వచ్చింది. కొమరం భీంగా ఆయన చేసే పోరాటాలు, ముఖ్యంగా పులితో చేసే ఫైటింగ్, నిజాం నవాబుపై తిరుగుబాటు మొదలగు అంశాలు అన్నీ ఈ సినిమాలొ చూడబోతున్నాం. అందువల్ల ఎన్టీఆర్ చాలా ధృఢంగా కనిపిస్తారని, కండలు పెంచి లావుగా కనిపిస్తారని ఊహించారు. కానీ తాజగా ఎన్టీఆర్ లుక్ చూసిన వారందరూ షాక్ కి గురవుతున్నారు.

 

 

ఒకానొక యాడ్ షూట్ కొరకు ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్ లో దర్శనమిచ్చిన ఎన్టీఆర్ చాల బక్క పలుచగా కనిపించారు. ఆ బక్క పలుచని దేహంతోనే నిజాం నవాబుపై గెరిల్లా యుద్ధానికి దిగి ఉంటాడు. అయితే నిజ జీవితంలో కొమరం భీం బక్కపలుచగానే ఉండేవాడు కాబట్టి ఎన్టీఆర్ కూడా సన్నబడ్డాడని అంటున్నారు. మరి సినిమాలోని ఎన్టీఆర్ లుక్ రివీల్ చేస్తే కానీ అభిమానులు సంతృప్తి చెందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: