ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు కుమార్తె పోర్న్ స్టార్ గా మారడం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. హాలీవుడ్ లో ఎన్నో సినిమాలను తెరకెక్కించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కుమార్తె పోర్న్ స్టార్ గా మారితే   తండ్రి కూడా దానికి మద్దతు పలకడం సోషల్ మీడియాలో కొన్ని రోజులపాటు వైరల్ గా మారిపోయింది. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్.. దత్తత కుమార్తె అయిన మీకెల స్పీల్ బర్గ్ .. తనకు శృంగారం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుందని  అందుకే పోర్న్ స్టార్ గా మారడానికి నిర్ణయించుకున్నానని.. దీనికి తన తండ్రితో పాటు కాబోయే భర్త కూడా అంగీకరించారు సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజుల క్రితం తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా పోర్న్ స్టార్ మీకెల  పై గృహహింస కేసు నమోదైంది. 

 

 

 

 ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మీకేలా కు  కాబోయే భర్త చెక్ పాంకో ధ్రువీకరించారు. కాగా మీకేలా  పై శనివారం కేసు నమోదైందని.. వెయ్యి డాలర్ల పూచీకత్తుపై బెయిల్ మంజూరు అయింది అంటూ చెప్పుకొచ్చారు. మరో 12 గంటలు మీకెలా జైలు నుండి బెయిల్ పైన విడుదలకానుంది అంటూ తెలియజేశారు కాబోయే భర్త చెక్ పాంకో . అయితే తల్లిదండ్రులను భర్తను ఒప్పించి పోర్న్ స్టార్ గా కెరీర్ ను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న రెండు వారాలకే మీకేలా  అరెస్టు కావడం గమనార్హం. ఆమెపై గృహహింస కేసు నమోదు చేయడం చూస్తుంటే ఎవరితోనూ గొడవ పడినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

 

 

 ఈ విషయాన్ని స్వయంగా మెకాలే కాబోయే భర్త ధ్రువీకరించాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మీకేలా... దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ ఆయన భార్య కేట్ కాప్షా  దత్తత తీసుకున్నారు.. అయితే 23 ఏళ్ల మీకెలా తనకు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నాయని అందుకే పోర్న్ స్టార్ గా మారేందుకు తన కెరీర్ ను ప్రారంభించేందుకు నిర్ణయించుకున్నాను అంటూ తెలిపింది. తన అభిమానుల్లో  ఎక్కువగా వయసుమళ్ళిన వైట్ మెన్ లను ఎంపిక చేసుకుంటాను అని... తనకు కాబోయే భర్త పై గౌరవంతో తాను కేవలం సోలో వీడియోలు మాత్రమే చేస్తాను అంటూ తెలిపింది. ఇతరులతో కెమెరాల ముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వీడియోలు తాను చేయబోను  అంటూ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: