టాలీవుడ్ గర్వంగా చెప్పుకునే మూవీస్ లో శంకరాభరణం అగ్రభాగాన ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ అయి నలభయ్యేళ్ళు అయినా కూడా ఇప్పటికీ ఆ ఫ్లావర్ అలాగే ఉంది. ఇపుడు ఆ మూవీ చూస్తున్నా కూడా నూతనత్వంతో ఉంటుంది. ఈ సినిమా ముందూ తరువాతా ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ శంకరాభరణం అన్న ఒక్క క్లాసిక్ చాలు మాకు అంటూ ఓటేస్తున్నారు టాలీవుడ్ జనం. దాన్ని తీసింది కళా తపస్వి, మహా యశస్వి పద్మశ్రీ  కే విశ్వనాధ్. ఆయన స్రుష్టి ముందు, స్రుజన ముందు మేము సాటి రామని చాలా మంది చేతులెత్తేశారు.

 

విశ్వనాధ్ శంకరాభరణం, సాగరసంగమం మూవీస్ కనీసం టచ్ చేయడం కాదు, వాటి పేర్లను కూడా ఊహించలేమని యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ అంటున్నారు. అది ఒక్క విశ్వనాధ్ కే సాధ్యమని ఆయన కచ్చితంగా చెప్పేస్తున్నారు. మనకు ఒక విశ్వనాధ్ మాత్రమే ఉన్నారు. ఆయన మాత్రమే ఈ సినిమాలు తీయగలరు. మళ్ళీ అలాంటి సినిమాలు రావాలని, కావాలని ఆడియన్స్ కోరుకోవచ్చు కానీ తీసే సత్తా మాత్రం మా తరానికి లేదని బోల్డ్ గా ఒప్పేసుకున్నాడు హరీష్ శంకర్. 

 


 తాము వేరే ఏమైనా సినిమాలు చూసి వాటిని తీయగలమేమో కానీ మాస్టర్ పీస్ గా ఉన్న విశ్వనాధ్ ఆ రెండు చిత్రాలను చేస్తామంటే  అది దుస్సాహసమే అవుతుందని కూడా హరీష్ నిజం చెప్పేస్తున్నాడు, ఒప్పేసుకుంటున్నాడు.  నిజంగా అది గొప్ప విషయమే. యంగ్ బ్లడ్ దేనికీ ఓడిపోము అంటుంది కానీ కొన్ని సార్లు, కొన్ని విషయాల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంతే దాన్ని అలాగే ఉంచాలి. టచ్ చేయకూడదు అంటారు.

 


 ఇపుడు హరీష్ అలాగే చెప్పాడనుకోవాలి. మరో వైపు టెక్నాలజీ పెరిగి టాలీవుడ్ కలెక్షన్లు కొల్లగొట్టవచ్చు. పాన్ ఇండియా మూవీస్ కూడా చేయవచ్చు కానీ మళ్ళీ అలనాటి క్లాసిక్స్ ని మాత్రం తీయడం అసాధ్యం, దుర్లభం అని టాలీవుడ్ పెద్దలే కాదు, సినిమాలు చూసే ఆడియన్స్ కూడా క్లారిటీగా చెప్పేస్తున్నారు. అందుకే దటీజ్ శంకరాభరణం.  హి ఈజ్ వ‌న్ అండ్ ఓన్లీ విశ్వనాధ్ అనిపించకమానదు. అది తెలుగు వారికి ఎంతో ప్రౌడ్ కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: