రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ దశలో ఉంది. బాహుబలి తర్వాత రాజమౌళి నుండి వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

 

 

ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు. కనీసం సినిమా పేరును కూడా ప్రకటించలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ల లుక్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. కొమరంభీంగా ఎన్టీఆర్ ఎలా ఉంటాడా అని ఆసక్తిగా ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ఎలా ఉంటుందో చూడాలని బాగా ఎదురు చూస్తున్నారు. కానీ ఆర్.ఆర్.ఆర్ నుండి మాత్రం ఎలాంటి అప్డేట్ రావడం లేదు.

 

 

ఇదంతా అటుంచితే తాజాగా ఒకానొక ప్రశ్న తలెత్తింది. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఎప్పుడు కలుసుకుంటారు..? అసలు వాళ్ళిద్దరూ కలుసుకుంటారా అన్న అనుమానం కలుగుతుంది.. నిజ జీవితంలో చూస్తే వీళ్ళిద్దరూ కలిసిన దాఖలాలు లేవు. కానీ ఈ సినిమా నిజమైన హీరోల కథలతో కూడిన కల్పిత కథ అని రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. మరి వీరిద్దరినీ కలుసుకున్నట్టు చూపిస్తాడా లేదా అన్నది అనుమానంగా ఉంది.

 

 


వీరిద్దరి కథలో ఒక పోలిక గురించి రాజమౌళి సినిమా లాంచింగ్ లోనే చెప్పాడు. వీరిద్దరూ బయట ప్రపంచానికి కనబడకుండా కొన్ని రోజులు బయటకి వెళ్ళిపోయారని, అప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారనే విషయం ఎవరికీ తెలియదని తెలిపాడు. ఆ సిట్యుయేషన్ ని తీసుకుని వాళ్ళిద్దరినీ కలిపే విధంగా కథ రాసుకున్నాడని అంటున్నారు. మరి సినిమా చూస్తే కానీ తెలియదు వీరెప్పుడు కలుసుకున్నారో..

మరింత సమాచారం తెలుసుకోండి: