జబర్దస్త్ అప్పారావు.. ప్రస్తుతం వెండితెర ప్రేక్షకులకే కాదు బుల్లితెర ప్రేక్షకులకు కూడా కొసమెరుపు. ఓ వైపు సినిమాల్లో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూనే మరోవైపు జబర్దస్త్ షోలో అదిరిపోయే స్కిట్స్  తో అదరగొడుతున్నాడు  కమెడియన్ అప్పారావు. ప్రస్తుతం బుల్లితెరపై ఆసమ్ అప్పి పేరుతో తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ కమెడియన్స్ అందరికీ ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్స్ లను  తమ తమ సినిమాల్లో కామెడీ చేయించేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు దర్శకులు. అంతే కాకుండా అటు ఎన్నో ఈవెంట్స్ లో  కూడా జబర్దస్త్ కమెడియన్స్ తనదైన కామెడీతో అదరగొడుతున్నారు. మంచి క్రేజ్ సంపాదించడమే కాదు డబ్బులు కూడా బాగానే సంపాదిస్తున్నారు. 

 

 

 అయితే జబర్దస్త్ షో కి రాకముందు నుంచే అప్పారావు సినిమాల్లో  నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ కొన్ని సినిమాల్లో అక్కడక్కడా కనిపించారు అప్పారావు. కానీ జబర్దస్త్ కి వచ్చిన తర్వాత మాత్రం అప్పారావు ఎంతో గుర్తింపు వచ్చింది. సినిమా అవకాశాలు కూడా పెరిగాయి. అయితే తనకు సినిమా అవకాశాలు పెరగడానికి ఇంత గుర్తింపు రావడానికి... తన జీవితం మొత్తం మారిపోవడానికి.. షకలక శంకర్ కారణం అని చెబుతున్నాడు జబర్దస్త్ కమెడియన్ అప్పారావు. షకలక శంకర్ టీమ్ లీడర్గా ఉన్న సమయంలో తనను జబర్దస్త్ లోకి తీసుకొని అవకాశం ఇవ్వడం వల్లే తనకు ఎంతో గుర్తింపు వచ్చింది అని తెలిపాడు అప్పారావు. 

 

 

 జబర్దస్త్ షోలో చేయడం ద్వారా ఏకంగా 100 సినిమాలకు పైగా తాను అవకాశాలను దక్కించుకున్నట్లు అప్పారావు తెలిపాడు. ఇదంతా షకలక శంకర్ వల్లే సాధ్యమైందని... షకలక శంకర్ తనకు జబర్దస్త్ లో అవకాశం ఇవ్వడం వల్లే తనకు ఇంత గుర్తింపు వచ్చి తన జీవితం మొత్తం మారిపోయింది అంటూ కమెడియన్ అప్పారావు చెబుతున్నాడు. అయితే ప్రస్తుతం అప్పారావు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ డైలాగ్ డెలివరీతో ప్రస్తుతం బుల్లితెరపై ఎక్కడ చూసినా అప్పారావు కనిపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: