టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగి కనుమరుగు అయిన హాస్య నటుల్లో వేణుమాధవ్ ఒకరు. అతి తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఆయన తన నటనతో మెప్పించారు. నటనలో వైవిధ్యం చూపించారు. స్టేజ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఆయన మెప్పించారు. అయితే అనూహ్యంగా ఆయన కనుమరుగు అయిపోయారు. టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు ఉన్నా సరే అవకాశాల కోసం ఆయన ఎదురు చూసారు. 

 

అనూహ్యంగా సినిమాల నుంచి ఆయన కనుమరుగు అయిపోయారు. వచ్చిన అవకాశాలను ఆయన వాడుకోలేదని కొందరు, తనకు ఉన్న ఇగో ప్రాబ్లం తో ఆయన నాశనం చేసుకున్నారని కొందరు, ఆయన మీద రాజకీయాల ప్రభావం కూడా పడింది అని అంటున్నారు. రాజకీయాల్లో ఆయన ఒక వర్గాన్ని మద్దతు గా చేసుకుని మాట్లాడిన మాటలు ఇబ్బంది పెట్టాయని అంటున్నారు. అందుకే 2014 ఎన్నికల తర్వాత ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు అనేది ఆయన్ను దగ్గరగా గమనించిన వారు చెప్పిన మాట. 

 

టాలీవుడ్ లో ఆయన్ను ఒక సామాజిక వర్గం బాగా టార్గెట్ చేసింది అని మరికొందరు వ్యాఖ్యానించారు. తన స్థాయికి తగని పాత్రలు ఇచ్చి ఆయన్ను ఇబ్బంది పెట్టారని, దీనితో ఆయన పూర్తిగా సినిమాలే వద్దని భావించారని అంటున్నారు. కమెడియన్ పక్కన మరో కమెడియన్ గా ఆయనకు అవకాశం ఇచ్చారు గాని ఆయన సామర్ధ్యాన్ని కొందరు గుర్తించి కూడా ఇబ్బంది పెట్టారని వార్తలు వచ్చాయి. అందుకే ఆయన సినిమాలకు దూరంగా జరిగిపోయారని, ఇక ఆరోగ్య సమస్యలు కూడా ఆయన్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయని మరికొందరు అంటున్నారు. కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడు ఆయన కొందరి తో వివాదాస్పద వైఖరి తో వ్యవహరించారని అందుకే పక్కకు తప్పించారు అని మరికొందరు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: