ఇటీవల సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున రగడ జరుగుతున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం దేశంలో మహిళలపై ఎక్కడ పడితే అక్కడ లైంగిక వేధింపులు జరుగుతున్న విషయం తెలిసిందే.  ఇది ఇప్పుడు సినీ పరిశ్రమలో కూడా జరుగుతుందని చాలా మంది హీరోయిన్లు.. ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు ఆరోపిస్తున్నారు.  వాస్తవానికి ఈ వేధింపులు ఇప్పటి నుంచి కాదని.. సినీ పరిశ్రమలో నటించేందుకు వచ్చేవారి బలహీనతలు క్యాష్ చేసుకొని వారితో పడక సుఖం కోరుకునేవారు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు సాగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.  శ్రీరెడ్డి ఇతర కొంత మంది హీరోయిన్లు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై తమ గళం విప్పారు.  

 

బాలీవుడ్ లో తనూ శ్రీ దత్తా, కంగనా రౌనత్ మీ టూ ఉద్యమం ద్వారా తమ ఆవేదన తెలిపారు.  అయితే ఎంత మంది ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఇలాంటి వాటిని ఎక్కడా అరికట్టలేకపోతున్నారు.  తాజాగా ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కోలీవుడ్ చిత్రసీమలో తనకు కూడా లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలిపింది. ఇండస్ట్రీకి చెందిన కొందరు నిర్మాతల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నానని చెప్పింది వరలక్ష్మి శరత్ కుమార్.

 

తాను అంత గొప్ప నటుడుకి పెద్ద కూతురు అని తెలిసి కూడా కొంత మంది బరితెగించి పడక సుఖాన్ని కోరుకునే వారని ఆగ్రహం వ్యక్తం చేసింది.  కొందరు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్ కూడా తన వద్ద ఉన్నాయని చెప్పింది. తాను నో చెప్పినందుకు తనను బ్యాన్ చేశారని... అయితే స్వశక్తితో తాను సొంత కాళ్లపై నిలబడ్డానని తెలిపింది. ఇక ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలు ఇలాంటి వాటికి కచ్చితంగా 'నో' చెప్పాలని, ధైర్యంగా బయటికి వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: