తెలుగు లో జబర్ధస్త్ కామెడీ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ఏడేళ్ళుగా టీవీ షో లలో ఓ సంచలనంగా నిలిచిన షో. ఈ షో కు పోటీగా ఎన్నో షో లు వచ్చాయి.. వెళ్ళాయి. కానీ, ఏడేళ్ళుగా జబర్దస్త్ నవ్విస్తూనే ఉంది.  జబర్ధస్త్ లో ఏడేళ్లుగా జడ్జీగా  కొనసాగుతూ వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ఇటీవల జి తెలుగు లో వస్తున్న అదిరింది షో కి జడ్జీగా వెళ్లారు.  ఆయన వెంట మరికొంత మంది కమెడీయన్స్ వెళ్లారు.  హంగామాతో ప్రారంభమైన ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిందని టీఆర్పీ రేటింగ్స్ చెప్పాయి. ఈ నేపధ్యంలో అదిరింది షో ఆగిపోతుందనే వార్తలూ ఇండస్ట్రీలో హల్చల్ చేశాయి.  

 

ఇక జబర్ధస్త్ కామెడీ షోకి నటులు ఎంత ప్రాముఖ్యతనో యాంకర్లు అందకన్నా ఎక్కువ అంటారు.  ఇప్పటికి పది ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలు అందుకొకపోగా.. మనుగడ కష్టం అనే ప్రచారం జరిగే స్థితికి వచ్చేసింది. స్కిట్ల మధ్యలో కమెడియన్లు యాన్కర్లపై వేసే పంచ్ లు.. వాటికి వాళ్ళిచ్చే రియాక్షన్లు.. చాలా ముఖ్యమైనవి. ప్రేక్షకులు కూడా ఎక్కువగా ఇటువంటి వాటికి కనెక్ట్ అయిపోతారు.   తాజాగా ఆమెను అదిరింది షో నుంచి తప్పించినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై సమీరా  స్పందించారు. తాను షో నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో వివరణ ఇస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు.

 

తాను 10 షోలకు మాత్రమే ఒప్పుకోలేదని, 26 ఎపిసోడ్లకు సంతకం చేశానని వివరించారు. ప్రొడక్షన్ వాళ్లకు ఏవైనా సమస్యలుండొచ్చని, తనకంటే అందగత్తె కావాలేమోనని సమీర అన్నారు.  అదిరింది షో నుంచి ఎందుకు తప్పుకున్నారు అని చాలా మంది మెసేజ్‌లు, ఫోన్లు చేస్తున్నారు.. నేను నా అంతట నేను తప్పుకోలేదు... వాళ్లే తీసి వేశారని అన్నారు. ఇంకో సంగతి నేను గర్భంతో ఉన్నానని, అందుకే షో నుంచి తప్పుకున్నానని అంటున్నారు. నిజానికి అలాంటిదేమీ లేదు. గుడ్‌న్యూస్ ఉంటే నేనే తప్పకుండా షేర్ చెస్తానని చెప్పింది సమీరా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Here’s the real reason behind it. Talking about the rumours.

A post shared by Sameera Sherief (@sameerasherief) on

మరింత సమాచారం తెలుసుకోండి: