తెలుగు సినీ ప్రేక్షకులే కాదు సౌత్ లో ఉన్న ప్రేక్షకులందరికీ ఉన్న ఒకే ఒక్క ఆతృత పవన్ కళ్యాణ్ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అని. పవన్ కళ్యాణ్ సినిమా న్యూస్ బయటకి రానంతవరకు ఆయన మళ్ళీ సినిమాలలోకి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశారు ప్రేక్షకులందరు. అయితే పవన్ ఉన్నపలంగా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ రీమేక్ లో నటించడానికి మేకప్ వేసుకొని రెడీ అయిపోయి సెట్ లో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు. అసలు ముందస్తు వార్తలు గాని హడావుడి గాని ఏమాత్రం లేకుండా డైరెక్ట్ గా సెట్ లో కనిపించి ఫ్యాన్సే కాదు ప్రేక్షకులందరికి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు పవర్ స్టార్. అయితే ఇప్పుడు ఆ ప్రేక్షకులందరికీ ఆయనని ఎప్పుడెప్పుడు థియోటర్స్ లో చూస్తామా అన్న ఆరాటం మొదలైంది. 

 

అందుకు కారణం తాజాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా పోస్టర్ రిలీజై అందరికీ స్వీట్ షాకివ్వడమే. ఈ పోస్టర్ లో పవర్ స్టార్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందో తెలియచెబుతుంది. వకీల్ సాబ్ లో వకీల్ గా చాలా పవర్ ఫుల్ లాయర్ గా అదరగొట్టబోతున్నారని తెలుస్తోంది. అసలే పవన్ కళ్యాణ్ కి ఆవేశం ఎక్కువ అంటుంటారు. ఈ ఆవేశ పరుడు ఆడ పిల్లలకి అన్యాయం జరిగితే ఊరుకుంటాడా ఉతికి ఆరేస్తాడు. అదే తాజాగా రిలీజైన పోస్టర్ లో కనిపిస్తోంది. 

 

ఇక దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎమ్ సీ ఏ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిజంగా దర్శకుడు వేణు శ్రీరామ్ కి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఇండస్ట్రీలో అంతమంది సీనియర్ డైరెక్టర్స్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసే అవకాశం ఈ కుర్ర దర్శకుడికి దక్కడం లక్కే. ఇక వకీల్ సాబ్ టైటిల్ పోస్టర్ ని రివీల్ చేసినప్పటి నుంచి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం ఈ పోస్టర్ మీద కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. పోస్టర్ అలా ఉందని ఆయన గెటప్ ఇలా ఉందని పనికిమాలిన కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మాటలు పవన్ ఫ్యాన్స్ విని ఊరుకుంటారా .. మా బాస్ హంగామా ఇప్పుడే కదా మొదలైంది ..అప్పుడే ఏముంది అంటూ రివర్స్ లో కామెంట్స్ వేస్తున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: