కొంతమంది హీరోయిన్స్ ని బొద్దుగా ఉంటేనే చూసి ఇష్టపడతాము. కొంతమందికి సన్నగా మెరుపు తీగలా ఉంటేనే చూడటానికి సరదా పడతాము. హస్నిక మొత్వాని తర్వాత మళ్ళీ బొద్దుగా ఉంటే ఇష్టపడింది ప్రేక్షకులు కీర్తి సురేష్ నే. అలాగే ఇలియానా సన్నని నడుముతో ఉంటేనే జనాలకి ఒక కిక్ ఉంటుంది. అందుకే ఇలియానా లావెక్కేసరికి ఎవరికీ నచ్చలేదు. సన్నని నడుముతో బెళ్ళీ డాన్స్ వేస్తుంటే ఇల్లి బేబు ఫ్యాన్స్ కి జ్వరమొచ్చేది. అలాంటిది కాస్త బొద్దుగా అయ్యోసరికి చీదరించుకుంటున్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ విషయంలో కూడా ప్రేక్షకులు అలాగే ఫీలవుతున్నారు. మొన్నటివరకు బొద్దుగా బబ్లీగా కనిపించిన కీర్తి సురేష్ ఒక్కసారిగా బక్కపల్చగా మారిపోయింది. ఆమె సన్నబడేసరికి ఒక్కొక్కరికి కరెంట్ షాక్ తగిలినంత పనైంది. 

 

అసలు కీర్తిని అలా చూడటానికి ఎవరూ ఇష్టపడటం లేదు. బొద్దుగా ఉన్నప్పుడు తెలుగు తమిళం లో చేసిన సినిమాలు ప్రేక్షకులు బాగా చూసి ఎంజాయ్ చేశారు. తెలుగులో మహానటి, అజ్ఞాతవాసి సినిమాలలో నటించిన కీర్తికి ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. అయితే ఈ అమ్మడికి సడన్ గా ఏమైందో గాని బక్క పలచని పర్సనాలిటీతో కనిపించి ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేసింది. తనే కాదు తనలాగా క్యాథరీన్ తయారై షాకిచ్చింది. ఇంతకముందు క్యాథరీన్ కూడా బొద్దుగా, ముద్దుగా ఉండేది. అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో క్యాథరీన్ బుగ్గలు, నడుము చూసి అంతా ఫిదా అయిపోయారు. కాని క్యాథరీన్ ఇప్పుడు సడన్ గా స్లిమ్ అయిపోయింది. తాజాగా క్యాథరీన్ చేసిన స్టిల్స్ చూసి అవాక్కవుతున్నారు.

 

మరి ఎందుకు హీరోయిన్స్ ఇలా బొద్దుగా ముద్దుగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండి సడన్ గా సన్నబడి షాకిస్తున్నారో తెలియడం లేదు. అందరిలా జీరో సైజ్ మేయిన్‌టైన్ చేయాలనా లేక ఫ్యాచర్ లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకూడదనా లేకపోతే బొద్దుగా ఉంటే కొంతమంది హీరోలు మాత్రమే అవకాశాలిస్తారు ..అదే సన్నబడితే అందరు హీరోలు పిలిచి అవకాశాలిస్తారన్న ఉద్దేశ్యమా తెలీదు గాని సన్నబడిన తర్వాత ఈ బొద్దుగుమ్మల లుక్ మాత్రం ప్రస్తుతం ఆకట్టుకునేలా లేదు. దాంతో వీళ్ళ అవతారాలు ఫ్యాన్స్ కే నచ్చడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: