ఈ మ‌ధ్య కాలంలో టాలీవుడ్‌లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల డిమాండ్లు బాగా పెరిగిపోయాయి. అవి ఏ రేంజ్‌లో అంటే హీరోయిన్ల‌తో స‌మానంగా డిమాండ్లు మొద‌లుపెట్టారు. అంతేకాక వీరి రెమ్యూన‌రేష‌న్లు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. అమ్మ, అత్త‌, అక్క‌, చెల్లి ఈ పాత్ర‌ల‌కు కూడా నిర్మాత‌లు మంచి రెమ్యూన‌రేష‌న్లు ఇచ్చి మ‌రీ పెట్టుకోవ‌ల్సి వ‌స్తుంది. ఏమాత్రం రెమ్యూన‌రేష‌న్ త‌గ్గినా వీరు న‌టించే ప్ర‌స‌క్తే లేదు అన్న స్థాయిలో ఉంటున్నారు. అయితే ఈ త‌ల్లి పాత్ర‌ల్లో న‌టించే న‌టీన‌టుల‌కు కూడా బ‌య‌ట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటుంది. వీరు న‌టించేది సైడ్ క్యారెక్ట‌ర్స్ త‌ల్లి, అక్క‌, చెల్లి పాత్ర‌లే అయినా వీరి వ‌య‌సు చిన్న‌ది కావ‌డంతో గ్లామ‌ర్‌కి మాత్రం కొద‌వ ఉండ‌డం లేదు. యూత్‌లో కూడా వీళ్ళ క్రేజ్ మాములుగా లేద‌నే చెప్పాలి. అందుకే వారికి నిర్మాత‌లు భారీగా ముట్ట‌జెప్పాల్సి వ‌స్తుంది. ఇక కొంత మంది ఆంటీలు తీసుకుఏ రెమ్యూన‌రేష‌న్లు చూస్తే మీరు షాక్ అవ్వ‌క మాన‌రు. 

 

ఇటీవ‌ల త‌ల్లి పాత్ర‌లంటే ముందు గుర్తువ‌చ్చేది మోడ్ర‌న్ త‌ల్లి ప‌విత్ర‌లోకేష్‌. ఇక ఆమె మోడ్ర‌న్ అమ్మ‌గా చాలా అద్భ‌తంగా న‌టిస్తది. ఇక ఈమెకి కాస్త పొగ‌రు కూడా ఎక్కువే అని అంటుంటారు అంద‌రూ. ఒక్క‌రోజు షూటింగ్‌కి ఈమె 60వేల వ‌ర‌కు తీసుకుంటుంద‌ట‌. రోహిణి కూడా అదే స్థాయిలో డైలీ పేమెంట్ ఆమె కూడా 50,60 వేలు రోజూ ముట్ట‌జెప్పాల్సిందే. ఇక బాలీవుడ్ క్వీన్ హేమామాలిని అయితే ఒక సినిమాకి ఏకంగా రెండు కోట్లు తీసుకుంద‌ట‌. ఆమె బాల‌కృష్ణ‌కు త‌ల్లిగా గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణిలో న‌టించింది. అప్పుడు ఆమె రెండు కోట్ల‌కు త‌క్కువ చేయ‌నంద‌ట‌. ఇక న‌దియా అయితే రెండు నుంచి మూడు ల‌క్ష‌లు తీసుకుంట‌ద‌. అత్తారింటికి దారేది చిత్రంలో ఆమె రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకుంద‌ట‌. ఇక ర‌మ్య‌కృష్ణ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబ‌లి చిత్రం నుంచి ఆమె రేంజే మారిపోయింద‌ని చెప్పాలి. అందుకే ఆమెకు ఆరు ల‌క్ష‌ల వ‌ర‌కు నిర్మాత‌లు ఇవ్వ‌వ‌ల‌సి ఉంటుంది. 

 


ఇక ఒక సినిమాకి వ‌చ్చి ఆమె డేట్స్ ఎక్కువ కావ‌ల్సి వ‌స్తే కోటిన్న‌ర‌వ‌ర‌కు తీసుకుంటుంద‌ట‌. త‌ల్లిగా, అత్త‌గా బామ్మ‌గా ఏ పాత్ర చేయ‌డానికైనా రెడీ గా ఉండే జ‌య‌సుధ రోజుకు రెండు ల‌క్ష‌లు తీసుకుంటద‌ట‌. ఇక ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటన అనే పదానికి పర్యాయపదం అయినా రేవతి రోజుకు 2 నుంచి 3 లక్షలు తీసుకుంటుంది. మ‌ధుబాల లాంటి కాస్త చిన్న‌హీరోయిన్ 75వేలు, శ‌ర‌ణ్య 50 నుంచి 70 వేలు డైలీ పేమెంట్. మ‌రి తుల‌సి విష‌యం వ‌చ్చేస‌రికి 30 నుంచి 40 వ‌ర‌కు తీసుకుంట‌ద‌ట‌. హేమ 40 నుంచి 50, సుధ 40 నుంచి 50 ఈ విధంగా ఈ ఆంటీల డిమాండ్లు టాలీవుడ్‌లో కొన‌సాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: