అక్కినేని నటవారసుడు నాగచైతన్య హీరోగా నటించిన సినిమా ‘ఆటోనగర్ సూర్య’. దేవకట్టా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎప్పుడో రిలీజ్‍ కావాల్సి ఉంది. కానీ, లేటౌతూ వచ్చింది. రీసెంట్‍గా ఆడియోని రిలీజ్‍ చేసి నిర్మాతలు ఆటోనగర్ సూర్యని మళ్లీ వెలుగులోకి తెచ్చారు. కానీ, ఈ సినిమాపై మరోసారి చీకట్లు కమ్ముకుంటున్నాయని కథలు వినిపిస్తున్నాయి. తడాఖా చిత్రం తర్వాత నాగచైతన్య హీరోగా నటించిన సినిమా ఆటోనగర్ సూర్య. ప్రస్థానం ఫేం దేవకట్టా దర్శక సారధ్యంలో రూపొందిన ఈ సినిమా విడుదల కోసం అక్కినేని అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఈ మూవీపై ఎపిహెరాల్డ్‌.కామ్ ఎక్స్‌క్లూజివ్ స‌మాచారాన్ని అందిస్తుంది. ఈ సినిమా నిర్మాతలు ఇటీవలే ఆడియోని విడుదల చేసి సినిమా రాకను ఖరారు చేసుకున్నారు. ఆటోనగర్‍ సూర్య చిత్రాన్ని జ‌న‌వరి 31న రిలీజ్ చేయాల్సి ఉండ‌గా, వాయిదా ప‌డి మ‌ళ్ళీ ఫిబ్రవరి 7కి వెళ్ళింది. ఇప్పుడు ఈ డైట్‌పైనా మ‌ళ్ళీ అనుమానాలు త‌లెత్తుతున్నాయి. దీంతో ఆటోన‌గ‌ర్ సూర్య ఎప్పుడ‌ విడుదల అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఫిబ్రవరి చివరి వారంలో కాని మార్చి మొదటివారంలో కాని విడుదల చెయ్యాలని తాజాగా నిర్ణయించారట.  ఇక సినిమా విషయానికొస్తే, యాక్షన్ హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే లక్ష్యంతో ఆటోనగర్ సూర్య కథను చైతు ఎంచుకున్నాడు. తనలోని కొత్త కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరిస్తుందని నాగచైతన్యతోపాటు అక్కినేని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు. ఈ సినిమాకి సమంత సెంటిమెంట్ కూడా ఉన్నందున విజయం తప్పనిసరిగా వరిస్తుందని యూనిట్ ధీమాతో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: