నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటుడిగా పలు సినిమాల్లో నటిస్తూ మరోవైపు నిర్మాతగా మరి తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై సినిమాలు కూడా నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు. రెండేళ్ల క్రితం ఆయన తన బ్యానర్ పై నిర్మించిన తొలి సినిమా అ మంచి విజయాన్ని అందుకుంది. యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మించిన హిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ టాక్ ని సంపాదించి దూసుకెళ్తోంది. 

 

కాగా ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎస్ ఎస్ రాజమౌళి, రానా, అనుష్క శెట్టి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఇక మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనుష్క మూవీ నిశ్శబ్దం సినిమా అఫీషియల్ ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని తన చేతుల మీదుగా ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో పక్కా సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుష్క, సాక్షి అనే మూగ ఆర్టిస్ట్ పాత్రలో నటిస్తోంది. 

 

అంజలి, సుబ్బరాజు, మాధవన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. మొన్న నాని నిర్మించిన సినిమా కోసం అనుష్క సాయం అందిస్తే, త్వరలో అనుష్క సినిమా కోసం నాని సాయం అందిస్తున్నారన్నమాట. ఈ విధంగా టాలీవుడ్ నటీనటులు ఒకరి సినిమాకు మరొకరు సాయం అందిస్తూ ముందుకు సాగడం ఎంతో మంచి పరిణామం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చాలా గ్యాప్ తరువాత అనుష్క నటిస్తున్న ఈ సినిమా ఎంత మేర సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: