త్రివిక్రం దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా తర్వాత మళ్ళీ పవన్ కల్యాణ్ సినిమా చేయలేదన్న సంగతి తెలిసిందే. అయితే రెండు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్, కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలు చేస్తే చూస్తారా .. ఆయనలో ముందున్న జోష్ అలాగే జనాలలో అంతకముందు ఉన్న క్రేజ్ ఉంటుందా అన్న అనుమానాలు కొంతమందిలో లేకపోలేదు. కానీ ఆ అనుమానాలకి గట్టి సమాధానమే చెప్పారు వకీల్ సాబ్.

 

వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ విడుదలైన కొన్ని నిమిషాలలోనే పెద్ద పెద్ద ప్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు పాలాభిషేకాలు చేశారు పవర్ స్టార్ ఫ్యాన్స్. కొన్ని చోట్ల భరాత్ లు నిర్వహించి ఫ్యాన్స్ పండుగ చేస్తున్నారు. మాస్ ఆడియన్స్ అలా చేస్తే కొందరు మాస్ అండ్ క్లాస్ ఆడియన్స్ సోషల్ మీడియా ను షేక్ చేశారు. ముఖ్యంగా వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ అన్ని చోట్లా జెట్ స్పీడ్ లో వైరల్ అయింది. ఫస్ట్ లుక్ విడుదలైన కొన్ని నిమిషాలకే వరల్డ్ వైడ్ గా టాప్ లో ట్రెండ్ అయ్యింది. ఇది నిజంగా ఎవరూ ఊహించలేదనే చెపాలి. ఫస్ట్ లుక్ లో పవర్ స్టార్ అదరగొట్టాడు.

 

ఇక నేషనల్ వైడ్ గా వకీల్ సాబ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవ్వడం షాకింగ్ అనిపించింది. నిన్న బాలీవుడ్ నెం.1 హీరో అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. దేశ వ్యాప్తంగా సూర్యవంశీ ట్రెండ్ అవుతున్న సమయంలో వకీల్ సాబ్ ను టాప్ లో ట్రెండ్ అయి అక్షయ్ కుమార్ కి షాకిచ్చిందని చెప్పాలి. అది కూడా వరుసగా మూడు హ్యాష్ ట్యాగ్స్ ను పవన్ ఫ్యాన్స్ జాతీయ స్థాయిలో టాప్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు. పవన్ స్టామినాతో మిగతా హీరోలు, బాలీవుడ్ స్టార్స్ కూడా అవాక్కయ్యోలా తాజా సన్నివేశం చూస్తే అర్థమవుతోంది. ఇక పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా వకీల్ సాబ్ పోస్టర్ ను చూసి స్పందించారు. మొత్తానికి చిన్న గ్యాప్ వచ్చినా కూడా పవర్ స్టార్ పవర్ అసలు తగ్గలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: